22 కోట్ల జనాభాలో ఒలింపిక్స్‌లో పాల్గొంది 10 మందేనా.. సిగ్గుపడుతున్నా! మాజీ క్రికెటర్ ఆవేదన!

Imran Nazir slams Pakistan sports authorities for sending only 10 athletes to Tokyo Olympics

కరాచీ: టోక్యోలో ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్‌ 2021లో పాకిస్తాన్ నుంచి కేవలం 10 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు ఒక ఫొటో కూడా షేర్ చేశారు. 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లతో పాటు, 2021లో పాల్గొన్న అథ్లెట్లు ఆ ఫొటోలో కనిపిస్తున్నారు. ఇది చాలా బాధాకరంగా ఉందని నజీర్ పేర్కొన్నారు. 2012 ఒలింపిక్స్‌కి.. ఇప్పటికీ పరిస్థితులు ఎలా మారాయో ఫొటో రూపంలో పాక్ మాజీ క్రికెటర్ చెప్పాడు.

Tokyo Olympics 2021: ముగిసిన జ్ఞానేశ్వ‌రన్ పోరాటం.. టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు నిరాశే!!Tokyo Olympics 2021: ముగిసిన జ్ఞానేశ్వ‌రన్ పోరాటం.. టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు నిరాశే!!

సిగ్గుచేటు:

22 కోట్ల జనాభా గల దేశం నుంచి టోక్యో ఒలింపిక్స్‌ 2021కు కేవలం 10 మంది ఆటగాళ్లే. ఇది నిజంగా విచారకరం. క్రీడల్లో పాకిస్థాన్‌ ఈ స్థాయికి దిగజారడానికి బాధ్యులైన ప్రతిఒక్కరికీ ఇది సిగ్గుచేటు' అని పాక్‌ మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్ నజీర్ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ దేశంలో ప్రతిభకు కొదవలేదని, అయితే క్రీడల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగే బాధ్యతగల నాయకులు లేరని విమరిషించాడు. చాలా మంది పాకిస్థాన్‌లో క్రీడలకు సంబంధించిన సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.. కానీ ఎంతమంది ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారని

ఇమ్రాన్ నజీర్ ప్రశ్నించాడు. ఆర్థిక సహకారం అవసరం ఉన్న ఒక ఆటగాడి వివరాలిస్తే.. ఎంతమంది సాయం చేయడానికి ముందుకు వస్తారని నిలదీశాడు.

30 సంవత్సరాలుగా ఒక్క పతకం లేదు:

30 సంవత్సరాలుగా ఒక్క పతకం లేదు:

2012లో జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ తరఫున 21 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌కు అత్యధికంగా పాక్‌ తరఫున 62 మంది అర్హత సాధించారు. పాక్‌ ఖాతాలో ఇప్పటి వరకు 10 పతకాలు ఉన్నాయి. ఇందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు కాగా.. 4 కాంస్య పతకాలు. 1992లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ తర్వాత పాక్‌ ఒక్క పతకం కూడా గెలవలేదు. ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న పాకిస్తాన్ పురుషుల హాకీ టీం సాధించిన కాంస్యమే.. పాక్ ముద్దాడిన చివరి ఒలింపిక్‌ పతకం. దాదాపు 30 సంవత్సరాలుగా పాక్ పతకం గెలవలేదు. ఈసారి కూడా ఆశలు లేవు. ఒకవేళ గెలిస్తే చరిత్రే.

 పాక్ అథ్లెట్లపై నెటిజన్లు ఫైర్:

పాక్ అథ్లెట్లపై నెటిజన్లు ఫైర్:

టోక్యో ఒలింపిక్స్‌లో ఆరంభ వేడుకలో పాక్ తరపున వెళ్లిన వారి నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. పాక్ దేశ జెండాను చూపుతూ వెనుక అథ్లెట్లు నడుస్తున్న సమయంలో..వారిలో పలువురు మాస్క్‌లు ధరించారు. మాస్క్‌ను ముక్కుకు కాకుండా గడ్డానికి పెట్టుకోవడం విమర్శలు వెల్లువెత్తాయి. టోక్యోలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అసలు గేమ్స్ జరుగుతాయో లేదో అన్న తరుణంలో ఒలింపిక్స్ మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్‌లు సరిగ్గా పెట్టుకోకపోవడం ఏంటని పాక్ అథ్లెట్లపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 మంచి హిట్టర్‌గా గుర్తింపు:

మంచి హిట్టర్‌గా గుర్తింపు:

1999-2012 మధ్య పాకిస్థాన్‌ క్రికెట్‌ టీంలో ఆడిన ఇమ్రాన్‌ నాజిర్‌.. మంచి హిట్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 14 బంతుల్లో అర్ధ శతకం సాధించిన రికార్డు అతని పేరిట ఉంది. పాక్ తరఫున ఇమ్రాన్‌ నాజిర్‌ 8 టెస్టులు, 79 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. టెస్టులో 427, వన్డేల్లో 1895, టీ20ల్లో 500 రన్స్ చేశాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి 4 సెంచరీలు, 13 అర్ధ శతకాలు చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, July 25, 2021, 14:26 [IST]
Other articles published on Jul 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X