Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపిఎల్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో చూసే వారి సంఖ్య 62 శాతానికి...

IPL
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా ఐపిఎల్. అంతలా అభిమానుల్లో చొచ్చుకుపోయింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఐపిఎల్ 4 రెండవ వారంలోకి అడుగు పెట్టింది. ఇది కేవలం ఒక టోర్నమెంట్ లాగా కాకుండా ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోయి బాగా హిట్ అయ్యింది, దీనతో పాటు ఇప్పడు రికార్డ్స్‌ని కూడా బద్దలు కొడుతుంది. పోయిన సంవత్సరం ఆన్‌లైన్ వివర్స్ షిప్‌తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆన్‌లైన్ వివర్స్ షిప్‌ దాదాపు 62శాతానికి పెరిగినట్లు వెల్లడించారు.

2010వ సంవత్సరం ఐపిఎల్3 మొదటి వారానికిగాను యూట్యూబ్‌లో 5.5మిలియన్ ఛానల్ వివ్స్ రాబట్టకలిగింది. అదే ఈ సంవత్సరం ఇండియా టైమ్స్, యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా 8.9 ఛానల్ వివ్స్‌ని రాబట్టకలిగాయి. ఏప్రిల్ 12వ తారీఖున అత్యధికంగా 1.7మిలియన్ ఛానల్ వివ్స్ వచ్చాయి. ఆరోజు రాజస్ధాన్ రాయల్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మీద తలపడగా, ఇంకొక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మీద బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడ్డారు.

ఐపిఎల్ 4కి గాను ఇండియా టైమ్స్‌కి యూట్యూబ్ అఫీసియల్ టెక్నాలజీ పార్టనర్ మరియు ఆల్ లైన్ స్ట్రీమింగ్‌గా వ్యవహారిస్తుంది. ఇండియా టైమ్స్ ఫేస్ బుక్‌లో కూడా పార్టనర్ షిప్ కలిగిఉంది. దీనివల్ల క్రికెట్‌ మ్యాచ్‌లకు సంబంధించి లైవ్ కాన్వర్‌‌సేషన్ క్రియేట్ చేయవచ్చు. ఇండియా టైమ్స్ యూట్యూబ్‌తో పార్టనర్ షిప్ పెట్టుకోవడం వల్ల ఐపిఎల్ 4కి సంబంధించినటువంటి లైవ్ ఎక్సీపీరయన్స్‌ని అభిమానులు యూట్యూబ్ ద్వారా ఆస్వాదించగలుగుతున్నారు.

ఈ సందర్బంలో టైమ్స్ ఇంటెర్నెట్ సిఈవో రిష్ ఖైని మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఐపిఎల్ 4కి సంబంధించినటువంటి మ్యాచ్‌‌లు లైవ్ స్ట్రీమింగ్ అందించగలుగుతున్నాం. టోర్నమెంట్ పూర్తి అయ్యే వరకు అభిమానులకు ఆ ఎక్సీపిరియన్స్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. రాబోయే కాలంలో ఐపిఎల్ స్ట్రీమింగ్ మ్యాచ్ లకు మంచి ప్యూచర్ ఉందని అనుకుంటున్నాం అని అన్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది క్రికెట్ అబిమానులు ఈ మ్యాచ్ లను ఆఫీసులలో నుంచే చూడడం జరుగుతుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+