For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచ కప్ విజయానికి ఏడాది పూర్తి.. రోహిత్ వీడియో వైరల్!

T20 World Cup 2024: జూన్ 29 భారత క్రికెట్ చరిత్రలో ఒక చారిత్రాత్మక దినం. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా దక్షిణాఫ్రికాను ఫైనల్‌లో ఓడించి టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది.17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయానికి ఏడాది పూర్తయిన సందర్భంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది మొదటి ఐసీసీ ట్రోఫీ. 13 సంవత్సరాల తర్వాత భారత్ ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయం చాలా అవసరం ఎందుకంటే ఒక ఏడాది క్రితం టీమిండియా సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయింది. అప్పుడు ఆటగాళ్లతో పాటు అభిమానులందరి గుండెలు పగిలాయి.జూన్ 29, 2024న ఈ విజయం ఆ ఓటమి బాధను మరచిపోయే అవకాశాన్ని ఇచ్చింది.

వీడియోను షేర్ చేసిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో రోహిత్ ఇలా అంటున్నాడు."ఈ విజయం నాకు ఇంకా ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను. ఈ విజయం దేశం మొత్తాన్ని సంతోషపరిచింది. ఇదంతా రాసి పెట్టి ఉంది. ఇదంతా విధి" అంటూ ఆ వీడియోలో ఫైనల్ మ్యాచ్‌లోని చిరస్మరణీయమైన క్షణాలను చేర్చాడు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో సహా ఇతర ఆటగాళ్లతో కలిసి ట్రోఫీతో నిలబడి ఉన్నారు. డ్యాన్స్ చేస్తున్నారు.హార్ధిక్ పాండ్యా కళ్లలో నీళ్లు ఉన్నాయి. రోహిత్ హార్దిక్ ఫాండ్యాను కౌగిలించుకుని ఉన్నాడు. ఒక ఫోటోలో రోహిత్ శర్మ స్వయంగా భావోద్వేగానికి లోనై ఉన్నాడు. అతని కళ్లలో నీళ్లు ఉన్నాయి.

One Year of T20 World Cup Victory Rohit Sharma Shares Emotional Video

సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్
స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ రోహిత్ శర్మ ఆ చిరస్మరణీయ రోజును గుర్తు చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టి, దానిని పరిశీలిస్తున్నప్పుడు చాలా ఉద్రిక్త వాతావరణం ఉందని రోహిత్ శర్మ చెప్పాడు. "క్యాచ్ సరిగ్గా పట్టుకున్నావా అని నేను సూర్యను అడిగాను, అతను అవునన్నాడు, ఆపై సరిగ్గా పట్టుకున్నాడో లేదో తెలియదని మాట్లాడుకోవడం విన్నాను. చివరకు థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చారు." రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ గెలిచిన 4 ఐసీసీ ట్రోఫీలు ఇవే..
కెప్టెన్‌గా రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాడు. అంతే కాకుండా రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో కూడా భాగమయ్యాడు. రోహిత్ శర్మ మొత్తం 4 ఐసీసీ ట్రోఫీ విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

Story first published: Sunday, June 29, 2025, 15:22 [IST]
Other articles published on Jun 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+