ఒకే ఓవర్‌లో 48 పరుగులు: యువ బ్యాటర్ సంచలన రికార్డు!
క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం మనం చూశాం. కానీ ఒకే ఓవర్లో ఏకంగా 48 పరుగులు రాబట్టడం ఎప్పుడైనా విన్నారా? ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన యువ సంచలనం సెదికుల్లా అటల్ ఈ అసాధారణ రికార్డుతో క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. క్రికెట్ మైదానంలో అసాధ్యం అనుకున్న రికార్డులను సుసాధ్యం చేస్తూ కాబూల్ ప్రీమియర్ లీగ్ వేదికగా సెదికుల్లా అటల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు బాది చరిత్రకెక్కాడు.
అసలేం జరిగిందంటే?
షాహీన్ హంటర్స్, అబాసిన్ డిఫెండర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. 19వ ఓవర్ వేయడానికి ఎడమచేతి వాటం స్పిన్నర్ అమీర్ జజాయ్ వచ్చాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ సెదికుల్లా అటల్ అతడిపై విరుచుకుపడ్డాడు. మొదటి బంతినే నో-బాల్‌గా వేయగా, అటల్ దానిని సిక్సర్‌గా మలిచాడు. బౌలర్ నియంత్రణ కోల్పోయి వరుసగా ఐదు వైడ్లు వేశాడు. నో-బాల్ తర్వాత వచ్చిన ఫ్రీ హిట్‌ను కూడా అటల్ స్టాండ్స్‌లోకి పంపాడు. ఓవర్‌లోని మిగిలిన ఐదు లీగల్ బంతులను కూడా అటల్ వరుసగా ఐదు సిక్సర్లుగా మలిచాడు.
మొత్తం స్కోరు: 7 + 5 + 6 + 30 = 48 పరుగులు!

48 బంతుల్లోనే సెంచరీ
ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ సాయంతో సెదికుల్లా అటల్ కేవలం 48 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న ఆయన 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 118 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా షాహీన్ హంటర్స్ జట్టు 213 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అమీర్ జజాయ్‌కి పీడకల
ఈ ఓవర్ వేసిన అమీర్ జజాయ్‌కు ఇది ఒక పీడకలగా మిగిలిపోయింది. అమీర్ జజాయ్ తన కోటా 4 ఓవర్లలో ఏకంగా 79 పరుగులు సమర్పించుకున్నాడు. లక్ష్య చేధనలో అబాసిన్ డిఫెండర్స్ జట్టు 121 పరుగులకే కుప్పకూలడంతో అటల్ జట్టు 92 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications