Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విలన్ అవుతానా, ధోనీ ఏమన్నాడో తెలీదు: అశ్విన్

ముంబై: ట్వంటీ 20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఒక్క నోబాల్‌ వేసినంత మాత్రాన విలన్‌ను అవుతానా అని టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎదురు ప్రశ్న వేశాడు. 'టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో వెస్టిండీస్‌తో ఓటమి ఎంతో నిర్వేదాన్ని కలిగించిందని అన్నాడు.

ఆ తర్వాత మూడురోజులు కనీసం పత్రికలు కూడా చూడలేదనిస ఎవరేం అనుకుంటారన్న దానిపై ఆసక్తి లేదని అన్నాడు. కొంతమంది మాజీ ఆటగాళ్లతో పాటు పేరున్న మీడియా ప్రతినిధులు కూడా స్పిన్నర్‌ అయి ఉండి ఎలా నోబాల్‌ వేస్తావని ప్రశ్నించారని చెప్పారు.

ఒక్క నోబాల్‌ వేసినంత మాత్రాన విలన్‌ను అయిపోతానా అని అడిగాడు. దీనిపై ఎవరి అభిప్రాయం వారిదనిస ఆ రోజు మంచు ప్రభావం ఎంతగా ఉందో నాతో పాటు బంతులేసిన బౌలర్లను అడిగితే చెబుతారని అన్నాడు. స్పిన్నర్లకు బంతిని తిప్పడం చాలా కష్టమైపోయిందని అశ్విన్‌ అన్నాడు.

One no-ball doesn't make a villain, says R. Ashwin

నిజాయితీగా చెప్పాలంటే మంచు కారణంగా తాను ఏ విధమైన భావనకు గురయ్యానో తనకే తెలియదని అన్నాడు. తొలి 12 బంతులు తాను వేశానని, తనకు వికెట్ లభించే అవకాశం కూడా వచ్చిందని, అటువంటప్పుడు ఆ విధమైన ప్రశ్నను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాలని అన్నాడు.

మంచు కారణంగా స్పిన్నర్లు సరిగా బౌలింగ్ చేయలేకపోయారని ధోనీ అన్న మాటలను మీడియా ప్రతినిధులు గుర్తు చేయగా ఆయనేమన్నాడో తనకు తెలియదని జవాబిచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+