Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌లో విచిత్రం: ఒక బంతి ముగ్గురు క్రికెటర్లను గాయపరిచింది (వీడియో)

హైదరాబాద్: క్రికెట్ ఆడే క్రమంలో ఆటగాళ్ల గాయాలు పాలవడం సహజం. సాధారణంగా బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్ మెన్‌కో లేక బౌలర్ లేదంటే అంఫైర్‌కు తగలడాన్ని పలు సందర్భాల్లో మనం చూశాం. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన ఓ స్ధానిక మ్యాచ్‌లో బౌలర్ వేసిన ఒక్క బంతి ముగ్గురు గాయాల‌కు కార‌ణ‌మైంది.

ఈ సంఘటన ఈ ఏడాది మొదట్లో జరిగినప్పటికీ, ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే విక్టోరియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్‌లో భాగంగా ఫుట్‌స్క్రే ఎడ్జ్‌వాట‌ర్‌, ఫిట్‌జ్రోయ్ డాన్‌కాస్ట‌ర్ జట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

One ball, three injuries: Bizarre cricketing incident in local match in Australia

స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మ‌న్ బ‌లంగా కొట్టిన బంతి నాన్‌స్ట్రైక‌ర్ కాళ్ల‌కు త‌గ‌ల‌డంతో అత‌ను గాయ‌ప‌డ్డాడు. ఆ షాట్ స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో బ్యాట్స్‌మ‌న్ భుజానికి తీవ్ర గాయ‌మైంది. ఆ తర్వాత మిడాఫ్‌లో ఉన్న ఫీల్డ‌ర్ ఆ బంతిని అందుకొని త్రో చేయ‌డంతో అది కాస్తా బౌల‌ర్ కంటిని బ‌లంగా తాకింది.

ఇలా ఒకే బంతికి ముగ్గురు గాయపడటంతో ఆట చాలా సేపటి వరకు నిలిచిపోయింది. ఆ తర్వాత ఫిజియో రావడంతో బౌలర్‌కు చికిత్స అందించడంతో కొద్ది సేపటి తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+