Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరెస్ట్ చేస్తామని ముంబై పోలీసులు బెదిరించారు: రోహిత్ శర్మ

Rohit Sharma

హైదరాబాద్: వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మను ఒకప్పుడు ముంబై పోలీసులు అరెస్ట్ చేస్తామని బెదిరించారట. ఈ విషయాన్ని రోహిత్ శర్మనే స్వయంగా వెల్లడించడం విశేషం. గౌరవ కపూర్ వెబ్ సిరిస్ 'చాంపియన్స్‌ విత్‌ బ్రేక్‌ఫాస్ట్‌ షో'లో పాల్గొన్న రోహిత్ శర్మ తన జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఈ షోలో చిన్నతనంలో తనను పోలీసులు అరెస్ట్‌ చేస్తామని బెదిరించిన ఘటనను రోహిత్‌ శర్మ గుర్తుచేసుకున్నాడు. 'మా కుటుంబం ఎప్పూడు క్రికెట్‌ను ఇష్టపడేది. రోజుకు 16 గంటలు క్రికెట్‌ మ్యాచ్‌లను చూసేవాళ్లం. మా బాబాయ్‌లు, పిన్నిలందరం కలిసి మా విధీలో క్రికెట్‌ ఆడే వాళ్లం. ఓ ముగ్గురు.. నలుగురు.. స్నేహితులమైతే విధీలో ఎప్పుడూ క్రికెట్‌ ఆడేవాళ్లం' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

'మా బాబాయ్‌లు బిల్డింగ్‌పై నుంచి చూస్తూ.. నా బ్యాటింగ్‌ను పరీక్షించేవారు. ఇలా ఆడుతూ భారీ షాట్లతో మా విధిలో చాలా కిటికీ అద్దాలు పగలగొట్టాను. వారంతా నాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు నా దగ్గరకు వచ్చి ఇంకోసారి కిటికీ అద్దాలు పగలగొడితే అరెస్ట్‌ చేస్తామని బెదిరించారు. నావల్ల మా చుట్టుపక్కల వాళ్లు చాలా ఇబ్బంది పడేవారు. ఆ తర్వాత మా క్రికెట్‌ని మైదానాల్లోకి మార్చడంతో ఇలాంటి ఫిర్యాదులు రాలేదు' అని రోహిత్‌ తెలిపాడు.

దీంతో పాటు తన భార్య రితికాను తొలి సారి కలుసుకున్న సందర్భంతో పాటు తన ఎంగేజ్‌మెంట్‌ రోజు హోటల్లో రింగ్‌ మర్చిపోవడం, తన అభిమాని క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ల గురించి ఎన్నో విషయాలను ఈ షోలో రోహిత్ శర్మ అభిమానులతో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో మీ కోసం...

కాగా, ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరిస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్వవహారిస్తున్నాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే శ్రీలంకపై మూడు వన్డేల సిరిస్‌తో పాటు టీ20 సిరిస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఇరు జట్ల చివరిదైన మూడో టీ20 ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 24, 2017, 13:06 [IST]
Other articles published on Dec 24, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+