ఆ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. జట్టుకు పుజారా ఎంపికయ్యే ఛాన్స్..!

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించబోతున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వర్గాలు ఏఎన్‌ఐకి తెలిపాయి. టీ20 ప్రపంచకప్ 2022లో పాల్గొనే ప్లేయర్లకు విశ్రాంతి లభించాలని కెప్టెన్సీని ధావన్‌కు అప్పగించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 ఎనిమిదో ఎడిషన్ ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13వరకు ఆస్ట్రేలియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కూడా వన్డే సిరీస్‌కు విశ్రాంతి లభించనుంది. స్టాండ్ ఇన్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు తెలిపారు.
దక్షిణాఫ్రికాతో టీ20, వన్డేలు ఇలా..
సెప్టెంబర్ 28నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ మూడు టీ20లు, అలాగే మూడు వన్డేలు ఆడనుంది. మొదటి టీ20 సెప్టెంబర్ 28న తిరువనంతపురంలో జరుగుతుంది. రెండోది అక్టోబర్ 2న గౌహతిలో, మూడోది అక్టోబర్ 4న ఇండోర్‌లో జరుగుతాయి. ఇక అక్టోబర్ 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. లక్నో వేదికగా తొలి వన్డే జరగనుంది. అక్టోబరు 9, 11తేదీల్లో వరుసగా రెండో, మూడో వన్డేలకు రాంచీ, ఢిల్లీ వేదికలు. ఈ వన్డే సిరీస్‌కు ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఆ ముగ్గురు జట్టులోకి..
ఇకపోతే టీ20 ప్రపంచకప్ కోసం రోహిత్ శర్మ & టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన జట్టు సభ్యులు అక్టోబర్ 9న లేదా 10న ఆస్ట్రేలియాకు బయలుదేరుతారు. ఆస్ట్రేలియన్ పరిస్థితులు, సమయాలకు అలవాటు పడడం కోసం ముందస్తుగానే టీమిండియా ఆసీస్ చేరుకోనుంది. వార్మప్ గేమ్‌లకు ముందు భారత్ ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇకపోతే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో రాహుల్ త్రిపాఠి ఎంపికై అరంగేట్రం చేసే వీలుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసిన ఉమ్రాన్ మాలిక్ కూడా వన్డే సిరీస్‌కు ఎంపికకావొచ్చు. అలాగే కౌంటీల్లో వన్డే ట్రోఫీలో అదరగొట్టిన పుజారా కూడా జట్టులోకి రావొచ్చు. ఇకపోతే 2022లో 9 వన్డేల్లో 51.85 సగటుతో 363పరుగులు చేసిన ధావన్ ఈ ఏడాది చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా 158 వన్డేల్లో ధావన్ 45.84 సగటుతో 17 సెంచరీలు, 38 అర్ధసెంచరీలతో 6,647పరుగులు చేశాడు.

ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యే జట్టు అంచనా:
1.శిఖర్ ధావన్, 2.శుభ్ మాన్ గిల్, 3.శ్రేయస్ అయ్యార్, 4.ఇషాన్ కిషన్, 5.రాహుల్ త్రిపాఠి, 6.రుతురాజ్ గైక్వాడ్, 7.షాబాజ్ అహ్మద్, 8.శార్దూల్ ఠాకూర్, 9.మహ్మద్ సిరాజ్, 10.ప్రసీద్ క్రిష్ణ, 11.మహమ్మద్ షమీ, 12. వాషింగ్టన్ సుందర్, 13.ఉమ్రాన్ మాలిక్, 13.కుల్దీప్ యాదవ్, 14.రవిబిష్ణోయ్, 15.వెంకటేష్ అయ్యార్, 16.చటేశ్వర్ పుజారా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications