రివేంజ్ నెంబర్ వన్
పుట్టిన రోజు వేడుకల సందర్భంగా హార్దిక్ పాండ్యా.. కోహ్లి ముఖం మీద మొత్తం కేక్ పూశాడు. ఈ ఫొటోలను పాండ్యా ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. 'రివెంజ్ నెం.1' అని ట్వీట్ చేశాడు.

మోడ్రన్ శకంలో బెస్ట్ బ్యాట్సుమెన్
'హ్యాపీ బర్త్‌డే విరాట్ కోహ్లీ. ఇది అద్భుతమైన ఏడాది కావాలని ఆశిస్తున్నాను' అని రవి శాస్త్రి, 'ఛేజ్ మాస్టర్, మోడ్రన్ మాస్టర్, ది రన్ మెషీన్‌కి హ్యాపీ బర్త్‌డే. ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ భారతీయుడు కావడం గర్వకారణం' అని ఆకాశ్ చోప్రా, 'ఈ మోడ్రన్ శకంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్ అయిన కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు' అని ఏంజెలో మాథ్యూస్ శుభాకాంక్షలు తెలిపారు.

వేగంగా పరిగేత్తేలా చేసేది నువ్వే
'హ్యాపీ బర్త్‌డే స్కిప్పర్' అని హార్దిక్ పాండ్యా, 'విరాట్ పదానికి మనోహరం అని అర్థం. ఫీల్డ్‌లో నీ ప్రదర్శనలు కూడా అంతే మనోహరంగా ఉంటాయి' అని రైనా, 'హ్యాపీ బర్త్‌డే స్కిప్పర్ విరాట్. ఎందరికో స్ఫూర్తిగా నిలవడమే కాదు వికెట్లు తీయడానికి మమ్మల్ని వేగంగా పరిగెత్తేలా చేసేది కూడా నువ్వే' అని రహానే పోస్టులు పెట్టారు.

హ్యాపీ బర్త్ డే విరాట్
'హ్యాపీ బర్త్‌డే విరాట్. నువ్విలాగే ఛేజింగ్‌లు చేస్తూ ఉండాలి' అని అశ్విన్, 'హ్యాపీ బర్త్‌డే విరాట్. నువ్విలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి' అని రాహుల్ శర్మ ట్వీట్ చేశారు. బీసీసీఐ హ్యాపీ బర్త్ డే విరాట్ అంటూ శుభాకాంక్షలు తెలిపింది.


Click it and Unblock the Notifications











