నా తండ్రి ఓ చెత్త విమర్శకుడు: 50వ టెస్టుపై పుజారా
హైదరాబాద్: టెస్టు క్రికెట్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 3 నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు పుజారాకి 50వది.
గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో పుజారా సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు కెప్టెన్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో లంకపై 304 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో 50వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్న పుజారా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తుండేవాడు
తన జీవితంలో గొప్ప వ్యక్తి తన తండ్రినేనని కానీ ఓ చెత్త విమర్శకుడు కూడా అతనేనని పుజారా అభిప్రాయపడ్డాడు. ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తూ తనను విమర్శించేవాడని పుజారా తెలిపాడు. ‘నా ఆటతీరు వివరించడంలో నా తండ్రే నాకు మంచి విమర్శకుడు. ఆట పట్ల అతను ఎంతో అంకిత భావం కలవాడు. కొన్నిసార్లు నా పట్ల కఠినంగా వ్యవహరించేవాడు' అని పుజారా అన్నాడు.

ఇద్దరం చర్చించుకోని ఓ నిర్ణయానికి వచ్చే వాళ్లం
అప్పుడు ఎందుకు అంత కఠినంగా వ్యవహరించేవాడో అర్థమయ్యేది కాదని, ఇప్పుడు అర్థమౌతోందని పుజారా పేర్కొన్నాడు. ఈ విషయంలో ఇద్దరం చర్చించుకోని ఓ నిర్ణయానికి వచ్చే వారిమని గుర్తు చేసుకున్నాడు. అతను కఠినంగా వ్యవహరించడంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగానని పుజారా తన తండ్రిని కొనియాడాడు.

దేశం తరఫున త్వరలో 50వ టెస్టు ఆడుతున్నా
అనంతరం తన క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడాడు. ‘ఇప్పటిదాకా నా కెరీర్ అద్భుతంగా సాగింది. సుదీర్ఘ ప్రయాణం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నా. దేశం తరఫున త్వరలో 50వ టెస్టు ఆడబోతున్నాను. దేశం తరఫున 50వ టెస్టు ఆడబోతుండటం గర్వంగా అనిపిస్తోంది' అని పుజారా చెప్పుకొచ్చాడు.

50వ టెస్టులో మరిన్ని పరుగులు చేస్తా
'కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నా ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే తదుపరి మ్యాచ్‌లోనూ పరుగులు సాధిస్తాననే నమ్మకముంది. కెరీర్‌లో గాయాలు కూడా నన్ను తీవ్రంగా బాధించాయి. వీటి నుంచి కోలుకోవడమే నాకు పెద్ద సవాలైంది. 50వ టెస్టులో మరిన్ని ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తా' అని పుజారా అన్నాడు. పుజారా 49 టెస్టుల్లో 52.18 సగటుతో 3966 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications