కోహ్లీ గాల్లో.. గెంతులు ఆటతీరును మించిపోయాయి

హైదరాబాద్: వరుసగా రెండు ఓటముల అనంతరం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ సేన చిరస్మరణీయ విజయం సాధించి పరువు నిలుపుకొంది. ఈ టెస్టులో సారథి కోహ్లీ అత్యంత క్లిష్టమైన పిచ్‌పై సఫారీ పేసర్లను దీటుగా ఎదుర్కొని రెండు ఇన్నింగ్స్‌ల్లో విలువైన పరుగులు(54, 41) చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 63 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
ఈ టెస్టులో కోహ్లీ తన బ్యాట్‌తో చేసిన విన్యాసాల కంటే ఇతర విన్యాసాలే ఇప్పుడు అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఈ టెస్టులో విజయోత్సాహంతో కోహ్లీ చేసిన జంప్‌ల గురించి ఇప్పుడు అభిమానులు నెట్టింట్లో ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఔట్ అయిన సందర్భంలో కోహ్లీ గాల్లోకి ఎగిరి చేసిన విన్యాసం అభిమానులను ఫిదా చేసింది.
కోహ్లీ క్లాసీ కవర్ డ్రైవ్‌ల కంటే ఈ విన్యాసం ఎంతగానో ఆకట్టుకుందని అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. అతడు ఈ జంప్‌తో గురుత్వాకర్షణను కూడా అధిగమించాడని పలువురు చమత్కరిస్తున్నారు.
*'కోహ్లీ జంప్ అద్భుతం. నమ్మశక్యం కావడం లేదు'
* 'కోహ్లీ క్రికెటర్ కాకుండా ఉంటే.. ఒలింపిక్స్ హై జంప్‌లో భారత్‌కు పతకాలు వచ్చేవే'
*'భార్య అనుష్క సినిమా 'జీరో'ను ప్రమోట్ చేసేందుకు కోహ్లీ ఇలా జీరో గ్రావిటీ జంప్ చేశాడేమో'
* 'బ్యాట్‌తో చేసిన అద్భుతాల కంటే.. ఈ విన్యాసాలే బాగున్నాయి'
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications