
తొలి ట్రిపుల్ సెంచరీ
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో సరిగ్గా ఇదే రోజున అంటే 2004 మార్చి 29న వీరేంద్ర సెహ్వాగ్ తొలి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నాడు భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించగా.. అక్కడి ముల్తానా స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్ ఈ ఘనత అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన తొలి ఆటగాడిగా సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు.
ఆ మ్యాచ్‌లో 295 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిక్సు కొట్టి సెహ్వాగ్ సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు ఇచ్చిన సెహ్వాగ్ మొత్తంగా 375 బంతులు ఎదుర్కొని 82 స్ట్రైక్‌రేట్‌తో 309 పరుగులు చేశాడు. ఇందులో 39 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి.

పాకిస్థాన్‌పై ఇండియా ఘనవిజయం
సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీకి తోడు సచిన్ 194 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 675-5 వద్ద డిక్లేర్ చేసింది. ఇక పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌటైంది.

మరో ట్రిపుల్ సెంచరీ
ఇక సరిగ్గా నాలుగేళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజున అంటే 2008 మార్చి 29న వీరేంద్ర సెహ్వాగ్ మరో ట్రిపుల్ సెంచరీ అందుకున్నాడు. చెన్నై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ ఏకంగా 100 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం.
ఈమ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 304 బంతులు ఎదుర్కొన్న సెహ్వాగ్ 104 స్ట్రైక్‌రేట్‌తో 319 పరుగులు చేశాడు. ఇందులో 42 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమెదు చేశాడు. అలాగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు అంతకు ముందు తన పేరు మీదనే 309 పరుగులతో ఉండగా.. దానిని సెహ్వాగే 319 పరుగులతో బద్దలు కొట్టడం విశేషం.

టెస్టు మ్యాచ్ డ్రా
అయితే సౌతాఫ్రికాతో జరిగిన నాటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 540 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమిండియా 627 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసి స్కోర్‌ను డిక్లేర్ చేసింది. అప్పటికే మ్యాచ్‌లో సమయం అయిపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.