Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

OTD: కోహ్లి విధ్వంసానికి పాకిస్థాన్ టీవీలు పగిలిన వేళ! (Video)

'కోహ్లి గోస్ డౌన్ ది గ్రౌండ్.. కోహ్లి గోస్ ఔట్ ఆఫ్ ది గ్రౌండ్'.... అంటూ ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే భారత్ వర్సెస్ పాకిస్థాన్ టీ20 మ్యాచ్‌లో చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైనవి. మునుపెన్నడూలేని విధంగా యుద్ధరీతిలో సాగిన పోరాటంలో టీమిండియాను విరాట్ కోహ్లి గెలిపించిన తీరు అద్భుతం, అసాధారణం, అనిర్వచనీయం. ఈ అద్వితీయమైన కోహ్లి ఇన్నింగ్స్‌కు నేటితో రెండేళ్లు. భారత్ చేతిలో చిత్తుగా ఓడి బాధతో పాకిస్థాన్ అభిమానులు టీవీలు పగలగొట్టిన సంఘటనకు నేటితో సరిగ్గా రెండేళ్లు!!

2022 టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 23వ తేదీన జరిగిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రత్యేకం. దాయాదీల పోరు అంటేనే మినిమమ్ ఓ మినీవార్ తలపిస్తుంటుంది. కానీ రెండేళ్ల క్రితం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ పోరు.. ఓ 'హై వోల్టేజ్‌ క్రికెట్ యుద్ధం'. ఓటమి కోరల్లో చిక్కుకున్న భారత జట్టును హార్దిక్ పాండ్యతో కోహ్లి కలిసి ఆదుకున్న తీరు అమోఘం.

On This Day Virat Kohli s MCG Masterclass Leads India to Thrilling Victory Over Pakistan

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (52; 42 బంతుల్లో, 5 ఫోర్లు), ఇఫ్తికర్ అహ్మద్ (51; 34 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. అర్షదీప్ సింగ్, హార్దిక్ చెరో మూడు వికెట్లు తీశారు. అయితే ఛేదనలో భారత్ 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) వరుసగా పెవిలియన్‌కు చేరారు.

On This Day Virat Kohli s MCG Masterclass Leads India to Thrilling Victory Over Pakistan

10 ఓవర్లకు భారత్ స్కోరు 45/4 మాత్రమే. ఇక విజయానికి ఆఖరి 18 బంతుల్లో 48 పరుగులు అవసరం. ఆ స్థితిలో కోహ్లి (82 నాటౌట్; 53 బంతుల్లో, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిన తీరు అసాధారణం. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో కోహ్లి మూడు బౌండరీలు బాదడంతో 18వ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. కానీ 19వ ఓవర్ వేసిన హారీస్ రవూప్ తొలి నాలుగు బంతులకు 3 పరుగులే ఇచ్చాడు.

On This Day Virat Kohli s MCG Masterclass Leads India to Thrilling Victory Over Pakistan

దీంతో విజయ సమీకరణం.. 8 బంతుల్లో 28 పరుగులు. అప్పుడు వచ్చిన బౌన్సర్‌ను కోహ్లి ఓ వెనకడుగు వేసి బౌలర్ మీదుగా కళ్ళుచెదిరే సిక్సర్ బాదాడు. తర్వాత బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు. ఇక చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమవ్వగా కోహ్లి సిక్సర్ బాదగా, ఆఖరి బంతికి విన్నింగ్ షాట్‌ను అశ్విన్ ఆడాడు.

Story first published: Wednesday, October 23, 2024, 9:25 [IST]
Other articles published on Oct 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+