On this day: సచిన్ లాస్ట్ వన్డే ఆడి నేటికి దశాబ్దం పూర్తి.. అదే మ్యాచ్‌లో కోహ్లీ కెరీర్ బెస్ట్ స్కోర్!

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి దశాబ్ద కాలం అవుతున్న ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. కాగా సచిన్ తన కెరీర్లో చివరి వన్డే మ్యాచ్‌ను పది సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆడాడు. కెరీర్ చివరి వన్డేలో సచిన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 10 సంవత్సరాలు పూర్తైన ఈ సందర్భంగా అభిమానులు నాటి సచిన్ ఇన్నింగ్స్‌ను ఒక సారి నెమరువేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ వన్డేల్లో తన కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించాడు.

సచిన్ హాఫ్ సెంచరీ
ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ 2012లో మార్చి 18 అంటే ఇదే రోజున తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 329 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లు మహ్మద్ హఫీజ్, నజీర్ జంషెడ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం 330 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ గౌతం గంభీర్ డకట్ అయ్యాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో కలిసి సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అలాగే కెరీర్లో 96వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 133 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తంగా 48 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కాగా అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్లో 100వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా 2012 డిసెంబర్ 23న సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి 2013 నవంబర్ 14న తప్పుకున్నాడు.

కోహ్లీ కెరీర్ బెస్ట్
సచిన్ టెండూల్కర్ ఔటైనప్పటికీ విరాట్ కోహ్లీ కెరీర్ బెస్ట్ ఫర్‌ఫామెన్స్ ఇవ్వడంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొత్తంగా 148 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 22 ఫోర్లు, 2 సిక్సులతో 183 పరుగులు చేశాడు. కోహ్లీకి రోహిత్ శర్మ కూడా 68 పరుగులతో సహకరించాడు. 183 పరుగులతో విధ్వంసం సృష్టించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

సచిన్ రికార్డులు
కెరీర్లో 463 వన్డే మ్యాచ్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ 44 సగటుతో 18426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 200 పరుగులుగా ఉంది. ఇక 200 టెస్టు మ్యాచ్‌ల్లో 53 సగటుతో 15921 పరుగులు చేశాడు. ఇందులో 68 హాఫ్ సెంచరీలు, 51 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 248 పరుగులుగా ఉంది. ఓ టీ 20 మ్యాచ్ కూడా ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్ 201 వికెట్లు కూడా తీశాడు.

దినేష్ కార్తీక్ సూపర్ సిక్సు
ఇదే రోజున దినేష్ కార్తీక్ కూడా కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ట్రైసిరీస్ క్వార్టర్ ఫైనల్‌లో భారత్ విజయానికి చివరి బంతికి 5 పరుగులు కావాల్సి సమయంలో కార్తీక్ సిక్స్ కొట్టి భారత్‌కు తిరుగులేని విజయాన్నిందించాడు. ఆ మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్ 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సులతో 29 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విజయాన్నిందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications