On This Day: 19 ఏళ్ల క్రితం వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ను ఊచకోత కోసిన సచిన్.. 130 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం

2003 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఊచకోత కోసిన సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్‌ను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. భారీ లక్ష్య చేధనలో టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన సచిన్ ఏకంగా 130 స్ట్రైక్‌రేట్‌తో విధ్వంసం సృష్టించాడు. సచిన్ భయానక ఇన్నింగ్స్ ధాటికి ఆ రాత్రి పాకిస్థాన్‌కు పీడకలగా మారిపోయింది. సచిన్ ఆడిన ఆ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు నేటికి సరిగ్గా 19 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి మ్యాచ్ విశేషాలను ఓ సారి నెమరు వేసుకుందాం.

పాకిస్థాన్ భారీ స్కోర్
2003 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు ఓపెనర్ సయీద్ అన్వర్ (101) సెంచరీతో చెలరేగాడు. మిగతా వారిలో యూనిస్ ఖాన్ 32, రషీద్ లతీఫ్ 29*, మహ్మద్ యూసుఫ్ 25, తౌఫీక్ ఉమర్ 22 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో జహీర్ ఖాన్, అశిష్ నెహ్రా రెండేసి వికెట్లు తీయగా.. దినేష్ మోంగియా, జావగల్ శ్రీనాథ్ తలో వికెట్ తీశారు.

సచిన్ విధ్వంసం
అనంతరం 274 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆరంభం నుంచే వరుస బౌండరీలతో పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 34 బంతుల్లోనే 53 పరుగలు జోడించాక వీరేంద్ర సెహ్వాగ్ (21) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ గంగూలీ డకౌట్ అయినప్పటికీ, మహ్మద్ కైఫ్‌తో కలిసి సచిన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

సచిన్ ఊచకోత
అప్పటికీ ప్రపంచంలోనే భయంకరమైన బౌలర్లుగా పేరు గాంచిన వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, యూనిస్‌ల బౌలింగ్‌ను సచిన్ టెండూల్కర్ ఊచకోత కోశాడు. వారి బౌలింగ్‌ను సునాయసంగా ఎదుర్కొంటూ ధారాళంగా పరుగులు రాబట్టాడు. దీంతో సచిన్‌కు ఎక్కడ బంతులు వేయాలో తెలియక పాక్ బౌలర్లు తలపట్టుకున్నారు. అయితే సెంచరీ ఖాయమనుకున్నసమయంలో 75 బంతుల్లోనే 98 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సచిన్ ఔటయ్యాడు. కానీ అప్పటికే భారత్‌ను సచిన్ విజయం వైపు తీసుకెళ్లాడు. 130 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన సచిన్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి. సచిన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ అతని గొప్ప ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.

భారత్ విజయం
సచిన్ ఔటయ్యాక యువరాజ్ సింగ్ (50*), రాహుల్ ద్రావిడ్ (44*) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. మహ్మద్ కైఫ్ కూడా 35 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా మరో 26 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుని సెమీ ఫైనల్ చేరింది. సచిన్ టెండూల్కర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సెమీఫైనల్‌లో కూడా గెలిచి ఫైనల్ చేరిన టీమిండియా తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రనరఫ్‌గా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications