కలిచి వేసిన క్షణానికి ఏడాది.. ధోనీ రనౌట్‌తో బరువెక్కిన కోట్లాది గుండెలు!

హైదరాబాద్: సరిగ్గా ఏడాది క్రితం( 2019 జూలై 10) ఇదే రోజు యావత్ భారతం శోకసంధ్రంలో మునిగింది. అసాధారణ ఆటతీరుతో ఆశలు రేకిత్తించిన కోహ్లీసేన.. కీలక సమరంలో చేతులెత్తేసి కోట్లాది మందికి తీరని బాధను మిగిల్చింది. టాపార్డర్, మిడిలార్డ్ కట్టకట్టుకొని విఫలమైనా.. మహేంద్రుడి పోరాటం భరోసా కలిగించింది. కానీ గట్టెక్కుతామనే దశలో దురదృష్టం రనౌట్ రూపంలో వెక్కిరించింది. వెరసి న్యూజిలాండ్ చేతిలో భారత్‌ ఓటమిపాలైంది. ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం చేజారింది.

మెగా టోర్నీ ముందు తర్వాత కోహ్లీ సేన అసాధారణ ఆట.. ఈసారి ప్రపంచకప్ భారత్‌కేనని యావత్ క్రికెట్ ప్రపంచం అనుకునేలా చేసింది. కానీ మిల్లీ మీటర్ దూరంలో మరోసారి భారత్ విశ్వవిజేతగా నిలిచే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక అదే రోజు మహీ చివరిసారిగా మైదానంలో కనిపించాడు. ఆ తర్వాత మళ్లీ బ్లూ జెర్సీ ధరించలేదు.

అద్భుత బౌలింగ్..

అద్భుత బౌలింగ్..

నాటి మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. వరుణుడు అడ్డంకిగా మారిన ఆ మ్యాచ్‌ రెండు రోజుల పాటు జరగ్గా న్యూజిలాండ్‌ తొలి రోజు 46.1 ఓవర్లలో 211/5తో నిలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను మరుసటి రోజుకు వాయిదా వేశారు. దీంతో తర్వాతి రోజు ఆ జట్టు మిగిలిన ఓవర్లు పూర్తి చేసి 8 వికెట్ల నష్టానికి 239 రన్స్ చేసింది. కేన్ విలియమ్సన్‌(67), రాస్‌ టేలర్‌(74) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భువనేశ్వర్‌(3) వికెట్లు తీయగా ఇతర భారత బౌలర్లు తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

ధోనీ- జడేజా సూపర్ ఇన్నింగ్స్..

ధోనీ- జడేజా సూపర్ ఇన్నింగ్స్..

ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ(50), రవీంద్ర జడేజా(77) ఆచితూచి ఆడుతూ అర్ధశతకాలతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రపంచకప్‌ చరిత్రలో ఏడో వికెట్‌కు అద్భుతమైన 116 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వారి సూపర్ ఇన్నింగ్స్‌తో విజయంపై ఆశలు రేకెత్తించారు. ఇక భారత విజయం లాంఛనమే అనుకున్న తరుణంలో భారీ షాట్‌ ఆడబోయిన జడేజా విలియమ్సన్‌ చేతికి చిక్కాడు. అయినా ధోనీ ఉన్నాడనే భరోసా ఉండగా.. ఆ వెంటనే గప్తిల్‌ విసిరిన సూపర్ త్రోకు మహీ రన్నౌ టయ్యాడు.

దీంతో కోట్లాది మంది భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. మైదానమంతా మూగబోయింది. చివరికి భారత్‌ 49.3 ఓవర్లలో 221 పరుగులు చేసి ఆలౌటైంది. అలా కోహ్లీసేన సెమీస్‌ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఐసీసీ నేడు ఒక ట్వీట్‌ చేసింది. నాటి మ్యాచ్‌ హైలెట్స్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది.

ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలు..

ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలు..

ఇక ఈ ఓటమి అనంతరం ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలు వచ్చాయి. ఒత్తిడిని తట్టుకుని ఆడగలే అనుభవమున్న ధోనీని కాదని.. పంత్, పాండ్యాలను ముందుకు పంపించడం టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహ లోపమని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. ముందే ధోనీని పంపిస్తే పంత్, పాండ్యా వంటి దూకుడైన ఆటగాళ్లను నిలవరించేవాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా టాపార్డర్ విఫలమైతే ఏంటనే ప్రణాళిక కూడా లేకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎంతసేపు కోహ్లీ, రోహిత్‌పైనే భారత్ ఆధారపడిందని, వారి విఫలమైతే ఏందనే ప్లాన్-బిని సిద్దం చేసుకోలేకపోయిందనే విమర్శలు వినిపించాయి.

నా క్రికెట్ కెరీర్‌లోనే అదో పెద్ద వెన్నుపోటు: సౌరవ్ గంగూలీ

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, July 10, 2020, 16:23 [IST]
Other articles published on Jul 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X