Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సరిగ్గా ఇదే రోజు.. ఆ చరిత్రాత్మక ఘట్టానికి తొమ్మిదేళ్లు!!

On this day: MS Dhoni finishes off in style as India win 2nd ICC World Cup in 2011


హైదరాబాద్
: 2011 ఏప్రిల్‌ 2 ఈ రోజును సగటు భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోడు. ఎందుకంటే.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచింది. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ (కపిల్‌ డెవిల్స్‌-1983 ప్రపంచకప్‌) తర్వాత భారత జట్టు మరోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాదిండి. ఆ చరిత్రాత్మక ఘట్టం జరిగి నేటికి సరిగ్గా తొమ్మిదేళ్లు అయింది.
 గొప్ప అనుభూతిని మిగిల్చింది:

గొప్ప అనుభూతిని మిగిల్చింది:

వాంఖడేలో శ్రీలంకతో రవవత్తరంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్ అభిమానులను ఉత్కంఠతో ఊపేసి, ఆనంద డోలికల్లో తేలేలా చేసింది. ప్రతిఒక్కరికి ఎంతో గొప్ప అనుభూతిని మిగిల్చింది. క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ను భారత ఆటగాళ్లు భుజానెత్తుకొని వాంఖడే స్టేడియంలో ఊరేగించిన దృశ్యాలు అభిమానుల కళ్లలో ఇప్పటికీ మెదులుతూనే ఉంటాయి.

అభిమానులకు మరో అవకాశం:

అభిమానులకు మరో అవకాశం:

ఆ చరిత్రాత్మక ఘట్టాన్ని మరోసారి వీక్షించడానికి, ఆ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి క్రికెట్‌ ప్రేమికులకు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ గురువారం పునఃప్రసారం చేయనుంది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ వీరోచిత పోరాటం, విరాట్ కోహ్లీ సమయోచిత ఇన్నింగ్స్, ధోనీ విన్నింగ్స్ షాట్ లాంటి ఎన్నో దృశ్యాలు అభిమానులు చూడనున్నారు.

భారత్ విజయం:

భారత్ విజయం:

ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన 2011 ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) అజేయ సెంచరీ చేసాడు. లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ఆదిలోనే కోల్పోయింది. విరాట్ కోహ్లీ (35) కాసేపు నిలబడ్డాడు. గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4)తో కలిసి ధోనీ (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6) నాలుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గంభీర్ ఔటైనా.. యువరాజ్ సింగ్‌తో కలిసి 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్‌ని ధోనీ ముగించాడు.

కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డు:

కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డు:

ఎంఎస్ ధోనీ అనగానే వెంటనే గుర్తొచ్చేది టీ20 ప్రపంచకప్ (2007), వన్డే ప్రపంచకప్ (2011). వీటితో పాటు 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మూడు ప్రతిష్టాత్మక టోర్నీలు భారత్ ఖాతాలో ఉన్నాయంటే మహీ అద్భుత కెప్టెన్సీనే అందుకు కారణం. ధోనీ ఇప్పటికీ బెస్ట్ కెప్టెన్లలో ఒకడిగా ఉన్నాడు.

Story first published: Thursday, April 2, 2020, 10:01 [IST]
Other articles published on Apr 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+