8 ఏళ్ల క్రితం ఇదే రోజు.. క్రికెట్ చరిత్రలో ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ!!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'కెప్టెన్ కూల్'గా జట్టును ముందుండి నడిపించే అతడి నాయకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత మహీది. 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్ ధోనీ నాయకత్వంలోనే గెలుచుకుంది. దీంతో క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ రికార్డుల్లోకి ఎక్కాడు. ధోనీ నాయకత్వంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుని నేటికీ ఎనిమిదేళ్లు పూర్తయింది.

WTC Final 2021: న్యూజిలాండ్ ప్లేయ‌ర్స్‌పై నోరు పారేసుకున్న ఫాన్స్.. చర్యలు తీసుకున్న ఐసీసీ!!WTC Final 2021: న్యూజిలాండ్ ప్లేయ‌ర్స్‌పై నోరు పారేసుకున్న ఫాన్స్.. చర్యలు తీసుకున్న ఐసీసీ!!

 ఆదుకున్న కోహ్లీ, జడేజా:

ఆదుకున్న కోహ్లీ, జడేజా:

అప్పటికే టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్​లు గెలిచి అద్భుతమైన ఫామ్​లో ఉన్న భారత జట్టుకు అప్పట్లో అది ఫుల్ జోష్ ఇచ్చిన ట్రోఫీ. దీంతో ఎంఎస్ ధోనీ పేరు క్రికెట్ చరిత్రలో మార్మోగిపోయింది. ​​ఎడ్జ్​బాస్టన్ వేదికగా జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీ​ తుది పోరులో భారత్​, ఇంగ్లండ్ ​ పోటీపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్​ను 20 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్​ చేసిన ధోనీసేన 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్​ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33) రాణించడంతో భారత్​ మెరుగైన స్కోరు చేసింది.

5 పరుగుల తేడాతో విజయం:

130 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్లు విఫలమైనా.. ఇయాన్ మోర్గాన్​ (33), రవి బొపారా (30) మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడి మంచి భాగస్వామ్యం నెలకొల్పినా.. తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. చివరకు 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​'గా రవీంద్ర జడేజా, 'మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​'గా శిఖర్​ ధావన్​లు నిలిచారు.

రెండో జట్టుగా భారత్:

రెండో జట్టుగా భారత్:

ఆస్ట్రేలియా తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రెండో జట్టుగా భారత్ ఘనత సాధించింది. 2002లో శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ఫైనల్​లో వర్షం కారణంగా లంక, భారత్​లను ఆ ఏడాది సంయుక్త విజేతలుగా ప్రకటించారు. మొత్తానికి భారత్ ఖాతాలో ఐదు ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ వన్డే ప్రపంచకప్‌ గెలిచిన విషయం తెలిసిందే.

350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్‌:

350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్‌:

టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ గతేడాది ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్‌ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183‌. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు. ఐపీఎల్ టోర్నీలో 211 మ్యాచులు ఆడి 4669 రన్స్ చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, June 23, 2021, 11:46 [IST]
Other articles published on Jun 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X