IPL 2022: యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా అరంగేట్రం ఈ రోజే.. తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ వికెట్!

జస్ప్రీత్ బుమ్రా. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విభిన్నమైన బౌలింగ్ డెలివరీతో బంతులు వేస్తూ గొప్ప గొప్ప బ్యాటర్లను సైతం ముప్పతిప్పలు పెడుతుంటాడు. ఇక బుమ్రా యార్కర్ సంధించాడంటే అది బ్యాటర్లకు గండంగానే చెప్పుకోవాలి. వరుసగా యార్కర్లను సంధించడంలో బుమ్రాకు తిరుగులేదు. ఈ క్రమంలో బుమ్రా యార్కర్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నాడు.
అలాగే కీలక సమయంలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో బుమ్రా దిట్ట అని చెప్పుకోవాలి. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఈ పేస్ గన్ హవా సాగుతుంది. ఈ క్రమంలోనే టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌గా కూడా బుమ్రా మన్ననలు అందుకుంటున్నాడు. అయితే బుమ్రా క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి సరిగ్గా 10 సంవత్సరాలు కావొస్తుంది.

తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ వికెట్
ఐపీఎల్ ద్వారా జస్ప్రీత్ బుమ్రా అందరికీ పరిచయం అయ్యాడు. 2013లో సరిగ్గా ఇదే రోజున అంటే ఏప్రిల్ 4న 19 ఏళ్ల వయసులో బుమ్రా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అయితే ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ తరఫున రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన బుమ్రా తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు.
ఆ మ్యాచ్‌లో కోహ్లీ వికెట్‌తోనే ఆగిపోకుండా మరో రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 32 పరుగులు మాత్రమే ఇచ్చి విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వికెట్లను తీశాడు.

2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి
తన డిఫెరెంట్ యాక్షన్ బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్న బుమ్రా ఆ ఏడాది ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బుమ్రా.. అదే ఏడాది వన్డే, టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు.
2018లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తక్కువ కాలంలోనే టీమిండియాలో కీలక ఆటగాడిగా మారిపోయాడు. కెరీర్ ఆరంభంలో బుమ్రా బౌలింగ్ స్టైల్ చూసి ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించడలేడని పలువురు వ్యాఖ్యానించారు. గాయమైతే కోలుకోవడం కష్టమని అన్నారు. కానీ వాటిన్నంటిని పటాపంచలు చేస్తూ ఆరేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ బౌలర్‌గా రాణిస్తున్నాడు.

బుమ్రా రికార్డులు
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 29 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 123 వికెట్లు తీశాడు. అత్యత్తమ బౌలింగ్ గణాంకాలు 6/27గా ఉన్నాయి. ఇక 70 వన్డే మ్యాచ్‌ల్లో 113 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/27 గా ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు 57 టీ20 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 67 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 3/11గా ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు 108 మ్యాచ్‌లాడిన బుమ్రా 133 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/14గా ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications