Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు: వరల్డ్ కప్‌ను ముద్దాడిన ధోని సేన

హైదరాబాద్: సెప్టెంబర్ 24, 2007... భారత క్రికెట్ చరిత్రలో గుర్తించుకోదగ్గ రోజు. సరిగ్గా పదేళ్ల క్రితం భారత్ తొలి టీ20 వరల్డ్ కప్‌ను గెలుపొందింది. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి టీ20 ఫార్మాట్‌లో విశ్వవిజేతగా అవతరించింది. చివరి ఓవర్లో మిస్బా ఉల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ను శ్రీశాంత్ అద్భుతంగా అందుకోవడంతో టీమిండియా ఛాంపియన్‌గా అవతరించింది.

2007 ఐసీసీ వరల్డ్ టీ20లో సీనియర్లు లేకపోవడంతో.. పెద్దగా అంచనాలు లేకుండానే ధోనీ సేన బరిలో దిగింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు పాకిస్థాన్‌కు 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కానీ భారత విజయానికి మిస్బా అడ్డంకిగా మారాడు.

చివరి ఓవర్ దాకా పోరాడి పాకిస్థాన్‌

ఓవైపు వికెట్లు పడుతున్నా.. చివరి ఓవర్ దాకా పోరాడి పాకిస్థాన్‌ను బరిలో నిలిపాడు. పాక్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు కావాలి, చేతిలో కేవలం ఒకే ఒక వికెట్ ఉంది. పెద్దగా అనుభవం లేని జోగిందర్ శర్మ చేతికి ధోని బంతిని అందించాడు. తొలి బంతిని వైడ్‌గా వేసిన శర్మ.. రెండో బంతిని సిక్సర్‌గా సమర్పించుకున్నాడు.

పాక్ విజయానికి 4 బంతుల్లో 6 పరుగులు

4 బంతుల్లో 6 పరుగులు చేస్తే చాలు. మిస్బా దూకుడు చూసి పాక్ గెలుస్తుందనే భావించారంతా. కానీ అతడు ఆడిన స్కూప్ షాట్‌ సరిగా కనెక్ట్ కాలేదు. షార్ట్ ఫైన్ లెగ్‌లో శ్రీశాంత్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో భారత్ సంబరాల్లో మునిగి పోయింది. ప్రస్తుతం 36 ఏళ్ల వయసులో కూడా ధోని అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

2009లో తొలిసారిగా భారత్ టెస్టుల్లో నంబర్ వన్ స్థానానికి

ధోని నాయకత్వంలోనే 2009లో తొలిసారిగా భారత్ టెస్టుల్లో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ధోని నేతృత్వంలోని టీమిండియా 2011లో వన్డే వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఐసీసీ నిర్వహించిన మూడు ట్రోఫీలను గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్‌గా ధోనీ చరిత్ర సృష్టించాడు.

కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లీకి మార్గనిర్దేశం

కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లీకి మార్గనిర్దేశం చేస్తున్నాడు. వికెట్ల వెనుక నిల్చోని ఇస్తున్న సలహాలు బౌలర్లకు ప్రయోజనం చేకూరుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న సిరిస్‌ను చూస్తే మీకు ఇట్టే అర్ధం అవుతుంది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+