Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

On This Day: టీమిండియా 28 ఏళ్ల కల నెర‌వేరింది ఈ రోజే.. నేటికి 11 ఏళ్లు పూర్తి.. ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌!

On This Day: India won the 2011 ODI World Cup completed 11 years.. Trending On Twitter

2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్. భార‌త్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఈ ప్ర‌పంచ‌క‌ప్ చిర‌స్థాయిగా నిలిచిపోయింది. ఎందుకంటే 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత భార‌త్ క‌ల మ‌ళ్లీ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లోనే నెరవేరింది. మ‌హేంద్ర సింగ్ ధోని నాయ‌క‌త్వంలోని నాటి టీం 2011 ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలుచుకుని భార‌త్‌కు రెండో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించింది. నాడు ధోన్ని కొట్టిన విన్నింగ్స్ సిక్స‌ర్ ఇప్ప‌టికీ భార‌త అభిమానుల క‌న్నుల‌ ముందే మెద‌లుతూ ఉంటుంది.

కాగా ఆ ప్ర‌పంచ‌ప్‌ను టీమిండియా గెలిచి నేటికి స‌రిగ్గా 11 ఏళ్లు పూర్త‌య్యాయి. 2011 ఏప్రిల్ 2నే టీమిండియా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా ఆవిష్క‌రించింది. ఈ సంద‌ర్భంగా అభిమానులంతా నాటి మ‌ధుర‌స్మృతుల‌ను గుర్తు చేసుకుంటున్నారు.

జ‌య‌వ‌ర్ద‌నే సెంచ‌రీ

జ‌య‌వ‌ర్ద‌నే సెంచ‌రీ

నాటి ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్, శ్రీ‌లంక త‌ల‌ప‌డ్డాయి. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక ఆ జ‌ట్టు బ్యాట‌ర్ మ‌హేల జ‌య‌వ‌ర్దనే అజేయ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ సంగ‌క్క‌ర్ (48), దిల్షాన్ (33), కుల‌శేఖ‌ర్ (32), తిశ్రా పెరీరా (22) స‌హ‌క‌రించారు. 88 బంతులు ఎదుర్కొన్న జ‌య‌వ‌ర్దనే 103 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. మొత్తంగా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో శ్రీ‌లంక 6 వికెట్ల న‌ష్టానికి 274 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో జ‌హీర్ ఖాన్‌, యువ‌రాజ్ సింగ్ రెండేసి వికెట్లు, హ‌ర్బ‌జ‌న్ సింగ్‌ ఒక వికెట్ తీశాడు.

దెబ్బ‌కొట్టిన మ‌లింగ‌

దెబ్బ‌కొట్టిన మ‌లింగ‌

అనంత‌రం 275 ప‌రుగుల భారీ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియాను శ్రీ‌లంక బౌల‌ర్ ల‌సిత్ మ‌లింగ ఆరంభంలోనే దెబ్బ‌కొట్టాడు. టీమిండియా దిగ్గ‌జ ఓపెన‌ర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌ను త‌క్కువ స్కోర్ల‌కే ఫెమిలియ‌న్ పంపాడు. స‌చిన్ 18 ర‌న్స్ చేయ‌గా.. సెహ్వాగ్ ఏకంగా డ‌కౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 31 ప‌రుగుల‌కే ఓపెన‌ర్ల వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. చాలా మాంది ఇక టీమిండియా గెల‌వ‌డం అసాధ్య‌మ‌ని భావించారు.

ఆదుకున్న గంభీర్‌

కానీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన గౌతం గంభీర్ టీమిండియా పాలిట ఆప‌ద్భాంద‌వుడి అవ‌తారం ఎత్తాడు. యార్క‌ర్ల‌తో విరుచుకుప‌డుతున్న ల‌సిత్ మ‌లింగ‌తో స‌హా శ్రీ‌లంక బౌల‌ర్లంద‌రిని స‌మ‌ర్ధ‌వంతంగా ఆడ‌డమేకాకుండా వారిపైకి ఎదురుదాడికి దిగాడు. ఈ క్ర‌మంలో టీమిండియాను ఆదుకోవ‌డ‌మే కాకుండా విరాట్ కోహ్లీ (35)తో క‌లిసి 83 ప‌రుగుల భాగ‌స్వామ్యం, ధోనితో క‌లిసి 109 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పి జ‌ట్టును ప‌టిష్ట స్థితిలో నిలిపాడు. ఈ ద‌శ‌లో సెంచ‌రీకి చేరువ‌య్యాడు. కానీ 97 ప‌రుగుల వద్ద పెరీరా బౌలింగ్‌లో బోల్డ్ అయి సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని కొల్పోయాడు. సెంచ‌రీ చేయ‌క‌పోత‌నేం నాటి ఆట‌తో గౌతం గంభీర్ భార‌త క్రికెట్ అభిమానుల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయాడు.

సిక్స‌ర్‌తో గెలిపించిన‌ ధోని

గంభీర్ ఔటైన‌ప్ప‌టికీ యువ‌రాజ్‌సింగ్‌తో క‌లిసి టీమిండియాను కెప్టెన్ ధోని విజ‌యతీరాల‌కు చేర్చాడు. మ‌రో 10 బంతులు మిగిలి ఉండ‌గానే సిక్స‌ర్‌తో జ‌ట్టుకు ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించాడు. మొత్తంగా 79 బంతులు ఎదుర్కొన్న ధోని 91 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. యువ‌రాజ్ కూడా 21 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఫైన‌ల్‌లో కెప్టెన్ ధోని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక‌య్యాడు. యువ‌రాజ్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ద‌క్కింది. కాగా సోష‌ల్ మీడియాలో నాటి విజ‌యాన్ని ఉద్దేశించి అభిమానులు అనేక పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన పోస్టులు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

స్కోర్లు:

శ్రీ‌లంక: 274-6

ఇండియా: 277-4

Story first published: Saturday, April 2, 2022, 14:47 [IST]
Other articles published on Apr 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+