For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

11 ఏళ్ల క్రితం.. టీ 20లో పాక్‌పై 3 బంతుల్లో విజయం( వీడియో)

On This Day: India beat Pakistan in a bowl-out; watch video

హైదరాబాద్: పదకొండేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు సెప్టెంబరు 14న క్రికెట్‌ చరిత్రలో అభిమానులు కొత్త అనుభూతి చెందిన రోజు. టీ20 ఫార్మటే కొత్తగా అనిపిస్తున్న తరుణంలో అందరినీ ఆశ్యర్చపరిచింది.. ఎప్పుడూ వినని, చూడని 'బౌల్‌ ఔట్‌' . అప్పట్లో మ్యాచ్‌ టై అయితే ఇరుజట్లకు చెరో పాయింట్.. అదే ఇప్పుడు సూపర్‌ ఓవర్‌. కానీ 2007 టీ20 ప్రపంచకప్‌లో 'బాల్‌ ఔట్‌' అనే కొత్త విధానం క్రీడా జనాలను ఆకట్టుకుంది.

పాక్‌.. బొక్క బోర్లా-గెలిచిన టీమిండియా:

పాక్‌.. బొక్క బోర్లా-గెలిచిన టీమిండియా:

సరికొత్త విధానంతో బొక్క బోర్లాపడ్డ జట్టు పాక్‌ అయితే గెలిచిన జట్టు టీమిండియా. సరిగ్గా 11ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌పై టీమిండియా గెలిచింది బాల్‌ ఔట్‌ విధానంతోనే. దానికి సంబంధించిన వీడియో ఐసీసీ ట్వీట్‌ చేసింది. కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంఎస్‌ ధోనీకి అసలు సవాలు 2007 టీ20 ప్రపంచకప్‌లో ఎదురైంది.

 పక్కావ్యూహాలతో టీమిండియా విశ్వవిజేతగా :

పక్కావ్యూహాలతో టీమిండియా విశ్వవిజేతగా :

పక్కావ్యూహాలు అమలు చేసిన టీమిండియా సగర్వంగా విశ్వవిజేతగా నిలిచింది. అయితే గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది పాక్‌. మొహమ్మద్ ఆసిఫ్(4/18) చెలరేగి బౌలింగ్‌ చేసినా.. ఊతప్ప(50), ధోని(33)లు రాణించటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.

ఐసీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన ‘బౌల్‌ ఔట్‌’

ఐసీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన ‘బౌల్‌ ఔట్‌’

అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన పాక్‌.. టీమిండియా బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేసింది. అందరూ మ్యాచ్‌ టై అయిందని నిరుత్సాపడుతున్న సమయంలో ఐసీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన ‘బౌల్‌ ఔట్‌' విధానం అందరినీ ఆకట్టుకుంది.

టీమిండియాను గెలిపించింది కొత్త విధానమే:

కొత్త విధానం ప్రకారం టీమిండియా ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, రాబిన్‌ ఊతప్ప, హర్భజన్‌ సింగ్‌లు నేరుగా బంతి వికెట్లను తాకేలా బౌలింగ్‌ చేయగా.. పాక్‌ బౌలర్లు యాసిర్‌ ఆరాఫత్‌, ఉమర్‌ గుల్, షాహిద్‌ ఆఫ్రిదిలు విఫలమైయ్యారు. దీంతో టీమిండియా 3-0 తేడాతో విజయం సాధించింది.

i. తొలి రౌండ్: ధోనీ కీపింగ్‌లో ఉండగా వీరేందర్ సెహ్వాగ్ స్టంప్‌లకు తగిలేలా ప్లాట్ డెలీవరీ వేసి సఫలమైయ్యాడు. పాకిస్తాన్ తరపున మాత్రం అరాఫత్ ఫుల్‌టాస్ వేసి ఆఫ్ స్టంప్‌ను మిస్సయ్యాడు.

ii. సెకండ్ రౌండ్: హర్భజన్ సింగ్ బౌలింగ్ వేసి స్టంప్‌లను తాకేలా చేశాడు. పాకిస్థాన్ జట్టు నుంచి గుల్ ప్రయత్నించి విఫలమైయ్యాడు.

iii. మూడో రౌండ్: మూడో రౌండ్‌లో టీమిండియాను నిలబెట్టేందుకు ఊతప్ప రంగంలోకి దిగాడు. వచ్చీ రావడంతోనే స్టంప్‌లకు తగిలేలా బౌలింగ్ చేసి సక్సెస్ అవడంతో తలపై ఉన్న టోపీని తీసి బంతిని గుంపులోకి విసిరేశాడు. ఆ సంబరం కూడా పాకిస్తాన్‌పై ఒత్తిడిని పెంచింది. పర్యావసానంగా షూటౌట్ ద్వారా 3-0తేడాతో టీమిండియానే గెలిచింది.

Story first published: Friday, September 14, 2018, 13:08 [IST]
Other articles published on Sep 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+