Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ సిగ్నేచర్ గురించి ఎవరైనా హెడ్ కు గుర్తు చేయండయ్య.. ఊపొస్తుందేమో

సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే ఏప్రిల్ 15న ఐపీఎల్ చరిత్రను తిరగరాసింది సన్ రైజర్స్ హైదరాబాద్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రికార్డు సృష్టించింది. మూడు వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక జట్టు స్కోరు. అక్కడితో ఆగలేదీ జట్టు. అంతకుముందు ముంబై ఇండియన్స్‌పై సాధించిన 277/3 రికార్డును పటాపంచలు చేసింది. తన సొంత రికార్డును తానే బద్దలు కొట్టింది.

టీ20 క్రికెట్‌లో ఈ స్కోరు ఈ ఒక్క జట్టు మాత్రమే చేయగలిగింది. ఆసియా కప్ లో మంగోలియాపై నేపాల్ సాధించిన స్కోర్.. 314/3. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఆర్‌సీబీపై 22 సిక్సర్లు కొట్టారు నాటి మ్యాచ్ లో. ఐపీఎల్ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఇది- ఆర్సీబీ పేరిట ఉన్న 21 సిక్సర్ల రికార్డును తుడిచిపెట్టింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్, ఆర్సీబీ కలిసి 38 సిక్సర్లు బాదారు. టీ20 చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్‌లలో ఒకటి.

On this Day in IPL 2024 SRH broke their own record 287 3 total against RCB Head Fastest Century

ఓడిపోయినప్పటికీ, ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఇది టీ20 క్రికెట్‌ చరిత్రలో ఓఓడిపోయిన జట్టు చేసిన అత్యధిక స్కోరు. సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 39 బంతుల్లోనే అద్భుత శతకం అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ క్రిస్ గేల్ (30 బంతులు) పేరిట చెక్కు చెదరలేదు. హెడ్ సాధించిన ఈ సెంచరీ సన్‌రైజర్స్ తరఫున కూడా అత్యంత వేగవంతమైనది. 43 బంతుల్లో సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలైంది.

ఐపీఎల్‌లో 250కి పైగా స్కోర్లను రెండుసార్లు సాధించిన మొదటి జట్టుగా సన్‌రైజర్స్ నిలవగా, ఆర్‌సీబీ కూడా అదే ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించి రెండవ జట్టుగా నిలిచింది. ప్రపంచ టీ20 క్రికెట్‌లో సర్రె (3), యార్క్‌షైర్ (2), చెక్ రిపబ్లిక్ (2), సోమెర్‌సెట్ (2) జట్లు కూడా 250కి పైగా స్కోర్లను నమోదు చేశాయి. ఆర్‌సీబీ బౌలర్ల ప్రదర్శన అత్యంత పేలవం. రీస్ టోప్లీ- 68, యష్ దయాల్- 51, ఫెర్గ్యూసన్- 52, విజయ్‌కుమార్ వైశాక్ -64 పరుగులు ఇచ్చారు. టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో నలుగురు బౌలర్లు 50కి పైగా పరుగులు ఇవ్వడం ఇది మొదటిసారి.

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఓ సెంచరీ ఓపెనింగ్ స్టాండ్‌తో కలిపి నాలుగు 50కి పైగా పరుగులు భాగస్వామ్యాలు నమోదయ్యాయి. టీ20 ఇన్నింగ్స్‌లో ఇలాంటి ఘనత సాధించడం ఇది రెండవసారి. అంతకుముందు 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆర్‌సీబీపై పూర్తి చేసింది ఈ స్థాయి రికార్డు నెలకొల్పింది. సన్‌రైజర్స్ 14.6 ఓవర్లలో 200 పరుగుల మార్కును చేరుకుంది. ఇది ఐపీఎల్‌లో మూడవ వేగవంతమైన స్కోర్.

Story first published: Wednesday, April 15, 2026, 15:11 [IST]
Other articles published on Apr 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+