Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2019లో ఈరోజు: ఆస్ట్రేలియాలో ఆసీస్‌పై టెస్టు సిరీస్‌ నెగ్గిన తొలి ఆసియా దేశంగా భారత్

On this day in 2019, India became first Asian team to register Test series victory in Australia

హైదరాబాద్: జనవరి 7 భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాలో ఆసీస్‌పైనే టెస్టు సిరీస్‌ విజయం సాధించిన ఆసియా తొలి దేశంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా చరిత్ర సృష్టించిన రోజు. 2019లో ఇదే రోజున టీమిండియా ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఓడించి చారిత్రక టెస్టు సిరీస్‌ గెలుపొందింది.

1947 నుంచి భారత్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నా గతేడాది వరకు ఒక్క టెస్టు సిరీస్‌‌లో కూడా విజయం సాధించలేదు. కోహ్లీ సారథ్యంలోని టీమిండియా గతేడాది ఆ ఘనత సాధించి 71 ఏళ్ల కలను నెరవేర్చడంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ను కోహ్లీసేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

తొలి టెస్టులో 31 పరుగులతో భారత్ విజయం

తొలి టెస్టులో 31 పరుగులతో భారత్ విజయం

ఛటేశ్వర్ పుజారా, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగులతో విజయం సాధించింది. తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన 250 పరుగులు చేయగా పుజారా(123) సెంచరీ సాధించాడు.

రెండో టెస్టులో ఆసీస్ విజయం

రెండో టెస్టులో ఆసీస్ విజయం

అనంతరం ఆస్ట్రేలియా 235 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియాను 291 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఇక, రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపొందడంతో సిరిస్ 1-1తో సమం అయింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 137 పరుగులతో విజయం సాధించింది.

టాప్ స్కోరర్‌గా పుజారా

టాప్ స్కోరర్‌గా పుజారా

సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టుకు పలు మార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను కోహ్లీసేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరిస్‌లో ఛటేశ్వర్ పుజారా 74.42 యావరేజితో 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.

21 వికెట్లు తీసిన బుమ్రా

21 వికెట్లు తీసిన బుమ్రా

ఈ సిరిస్‌లో జస్ప్రీత్ బుమ్రా 17 యావరేజితో 21 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ సైతం 21 వికెట్లు తీసినప్పటికీ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించలేకపోయాడు.

51 వికెట్లు తీసిన భారత బౌలర్లు

టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ 16 వికెట్లు పడగొట్టగా... ఇషాంత్ శర్మ 11 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా(7), అశ్విన్(6), కుల్దీప్ యాదవ్(5), ఉమేశ్ యాదవ్(2) వికెట్లు తీసి టీమిండియా విజయంలో సపోర్టింగ్ పాత్ర పోషించారు. మొత్తంగా ఈ సిరిస్‌లో భారత బౌలర్లు 51 వికెట్లు తీశారు. చారిత్రక విజయం సాధించిన ఏడాది గడిచిన సందర్భంగా బీసీసీఐ ట్విటర్‌లో ఆ విషయాన్ని వెల్లడిస్తూ అప్పటి ఫొటోలను షేర్ చేసింది.

Story first published: Tuesday, January 7, 2020, 17:44 [IST]
Other articles published on Jan 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+