Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రోజున: సెంచరీతో గవాస్కర్ రికార్డు బద్దలు కొట్టిన సచిన్

On this day in 2005: Sachin Tendulkar surpassed Sunil Gavaskar to become leading Test centurion

హైదరాబాద్: సరిగ్గా 14 ఏళ్ల క్రితం(డిసెంబర్ 10, 2005) ఇదే రోజున క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అత్యధిక టెస్టు సెంచరీల రికార్డుని సచిన్ అధిగమించాడు.

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం(ఇటీవలే అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చారు)లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డుని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ 177 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ సాధించాడు.

గవాస్కర్ రికార్డుని అధిగమించిన సచిన్

గవాస్కర్ రికార్డుని అధిగమించిన సచిన్

సచిన్‌కి ఇది 35వ సెంచరీ. ఫలితంగా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటికీ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు సచిన్ టెండూల్కర్(51) పేరిట ఉంది. అయితే, అంతకముందే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

56 పరుగులకే రెండు వికెట్లు

56 పరుగులకే రెండు వికెట్లు

56 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను సచిన్ తన సెంచరీతో ఆదుకున్నాడు. ఈ టెస్టులో సచిన్ ఒక్కడే సెంచరీ సాధించడం విశేషం. సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో రోజు ఆటలో భాగంగా మురళీధరన్ బౌలింగ్‌లో సచిన్ ఔటయ్యాడు.

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకపై 60 పరుగుల ఆధిక్యం

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకపై 60 పరుగుల ఆధిక్యం

సచిన్ సెంచరీ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకపై 60 పరుగుల ఆధిక్యాన్ని సాధించి పెట్టింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్ రాణించడంతో టీమిండియా ఈ మ్యాచ్‌లో 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తన కెరీర్‌లో మొత్తం 200 టెస్టులాడిన సచిన్ 15,921 పరుగులు చేశాడు.

అగ్రస్థానంలో సచిన్

అగ్రస్థానంలో సచిన్

టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సచిన్ తర్వాత రికీ పాంటింగ్(13378) రెండో స్థానంలో ఉన్నాడు. మోడ్రన్ డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ(7054 పరుగులు), జో రూట్(7043), స్టీవ్ స్మిత్(6973) సచిన్ రికార్డుని అందుకుంటారేమో చూడాలి మరి.

100 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్

100 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్

1989లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన సచిన్‌ టెండూల్కర్ సెప్టెంబర్‌ 9, 1994న తన మొదటి సెంచరీ సాధించాడు. 78 మ్యాచ్‌లు ఆడిన తర్వాతే తొలి సెంచరీని అందుకోవడం విశేషం. టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలు కలుపుకుని క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్.

Story first published: Tuesday, December 10, 2019, 15:46 [IST]
Other articles published on Dec 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+