
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్
2007సంవత్సరం ఏప్రిల్ 28న.. పశ్చిమ ఆస్ట్రేలియాలో బార్బడోస్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి.. ఆస్ట్రేలియా హ్యాట్రిక్ వరల్డ్ కప్ విజయాలను సాధించింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ వైస్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ భీకర ప్రదర్శన చేశాడు. 104బంతుల్లో 149పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఓపెనర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హేడెన్ గేమ్‌పై మంచి పట్టు సాధించి తొలి వికెట్‌కు 172పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి 10ఓవర్లలో వీరిద్దరు 46పరుగులు మాత్రమే చేసిన.. శ్రీలంక జట్టు తర్వాతి 12ఓవర్లలో తన పట్టు కోల్పోయింది.
చెలరేగిన గిల్‌క్రిస్ట్, హేడెన్
గిల్‌క్రిస్ట్, హేడెన్ ఇద్దరు 10రన్ రేట్‌తో 117పరుగులను చేశారు. హేడెన్ అవుట్ అయిన తర్వాత.. గిల్‌క్రిస్ట్ తన ఫ్రంట్ ఫుట్ డ్రైవ్‌లతో శ్రీలంక బౌలర్లను ఆడుకున్నాడు. 31వ ఓవర్ వరకు గిల్లీ విధ్వంసం సాగింది. దిల్హార ఫెర్నాండో వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీని గిల్లీ తప్పుగా టైం చేసి మిడ్ వికెట్ వద్ద చమర సిల్వాకు దొరికిపోయాడు. 13బౌండరీలు, 8సిక్సర్లతో గిల్‌క్రిస్ట్ గ్రౌండ్లో తుఫాన్ సృష్టించాడు. ఈ మ్యాచ్‌తో గిల్ క్రిస్ట్ వన్డేల్లో 9000పరుగులను పూర్తి చేసుకున్నాడు. అలాగే ప్రపంచకప్ టోర్నీల్లో 1000పరుగులను పూర్తి చేసకున్నాడు. అనంతరం కెప్టెన్ పాంటింగ్, ఆండ్రూ సైమండ్స్, షేన్ వాట్సన్, మైకేల్ క్లార్క్‌లు కూడా రాణించడంతో 38ఓవర్లలో ఆసీస్ 4వికెట్లు కోల్పోయి 281పరుగుల భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా ఓవర్లను కుదించారు.
జయసూర్య, సంగక్కర పోరాడినా
వర్షం వల్ల శ్రీలంకకు 36ఓవర్లలో 269పరుగుల టార్గెట్ చేయాల్సి వచ్చింది. ఛేజింగ్‌కు దిగిన శ్రీలంక.. ఓపెనర్ ఉపుల్ తరంగ తొందరగా ఔట్ కాగా.. తర్వాత సనత్ జయసూర్య (63), కుమార సంగక్కర(54) కలిసి శ్రీలంక ఇన్నింగ్స్‌ను 100పరుగులు దాటించారు. వారిరువురు ఔటయ్యాక శ్రీలంక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. తర్వాత వచ్చిన కెప్టెన్ జయవర్ధనే, ఇతర బ్యాటర్లెవరు 30పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయారు. 36ఓవర్లలో శ్రీలంక 8వికెట్లు కోల్పోయి 215పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరికి వర్షం కూడా వారికి సహాయం చేయలేకపోయింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. 53పరుగుల తేడాతో ఆసీస్ విజయాన్ని అందుకుంది.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టుగా పేర్కొనబడింది. ఆస్ట్రేలియా 5సార్లు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 1987, 1999, 2003, 2007, 2015 ప్రపంచకప్ టోర్నీల్లో ఆసీస్ విశ్వవిజేతగా నిలిచింది. అలాగే 1975, 1996లో రన్నరప్‌గా నిలిచింది. మొత్తం ఏడు సార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది.


Click it and Unblock the Notifications












