Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జనవరి 17 స్పెషల్: 600 వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్ కుంబ్లే

హైదరాబాద్: తన క్రికెట్ కెరీర్లో ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లేకి జనవరి 17 ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈరోజు టెస్టు క్రికెట్ ఎలైట్ బౌలర్ల జాబితాలో చేరాడు. 2008లో పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కుంబ్లే తన కెరీర్‌లో 600వ వికెట్‌ తీశాడు.

తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కుంబ్లే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పెర్త్‌లో జరిగిన ఈ టెస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ వికెట్ తీయడంతో ఈ ఘనతను సాధించాడు. కుంబ్లే విసిరిన బంతిని ఆండ్రూ సైమండ్స్‌ ఆడగా అది బ్యాట్‌ అంచుకు తగిలి వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోని చేతిని తాకి గాల్లోకి ఎగిరింది.

తన కెరీర్‌లో 600 వికెట్‌ తీసిన కుంబ్లే

తన కెరీర్‌లో 600 వికెట్‌ తీసిన కుంబ్లే

అయితే అక్కడే స్లిప్‌లో ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ వెంటనే దానిని అందుకోవడంతో కుంబ్లే తన కెరీర్‌లో 600 వికెట్‌ తీసిన ఘతను అందుకున్నాడు. అంతేకాదు టీమిండియా తరుపున ఈ మైలురాయిని అందుకున్న ఒకే ఒక్క ఆటగాడు కూడా కుంబ్లే కావడం విశేషం.

132 టెస్టులాడి మొత్తం 619 వికెట్లు తీసిన కుంబ్లే

132 టెస్టులాడి మొత్తం 619 వికెట్లు తీసిన కుంబ్లే

వెటరన్ క్రికెటర్‌గా కుంబ్లే సాధించిన ఓ అరుదైన ఘనత ఇది. 1990 నుంచి 2008 వరకు భారత జట్టుకు సేవలందించిన కుంబ్లే 132 టెస్టులాడి మొత్తం 619 వికెట్లు తీసుకున్నాడు. ఇక శ్రీలంక క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్‌ 133 టెస్టుల్లో 800 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉండగా ఆసీస్‌ బౌలర్‌ షేన్‌వార్న్‌ 145 టెస్టుల్లో 708 వికెట్లు తీసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు

టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు

సహచర ఆటగాళ్లు కుంబ్లేని ముద్దుగా జంబో అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కుంబ్లే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌లో కొన్నాళ్ల పాటు తన సేవలందించారు. గతేడాది టీమిండియా హెడ్ కోచ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల టీమిండియా సాధించిన విజయాన్నింటి వెనుక కుంబ్లే పాత్ర ఉంది.

కుంబ్లే కెరీర్‌ సాగిందిలా

కుంబ్లే కెరీర్‌ సాగిందిలా

టెస్టులు: 132

వికెట్లు: 619

వన్డేలు: 271

వికెట్లు: 337

ఐపీఎల్‌: 42

వికెట్లు: 45

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+