
హైదరాబాద్: 2018 జనవరి 2 నాటికి పాతికేళ్ల ముందు స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. సిడ్నీ మైదానంలో భారత్‌తో తొలి టెస్ట్‌ను ఆడిన తన ఖాతాలో వికెట్ల సంఖ్యను పెంచుకుంటూ వచ్చాడు. 113 సంవత్సరాల క్రితం 1879లో సాధించిన ఆస్ట్రేలియా బౌలర్ ఫ్రెడ్ స్పొఫ్ఫర్త్ చేసిన హ్యాట్రిక్‌ను షేర్న్ వార్న్ కొల్లగొట్టాడు.
అప్పటి మ్యాచ్‌లో లీడ్ బ్యాట్స్‌మన్ అయిన రవిశాస్త్రిని (ప్రస్తుత టీమిండియా కోచ్) అవుట్ చేయడం ద్వారా తన టెస్టు వికెట్ల ఖాతాను తెరిచారు. మిగిలిన మ్యాచ్‌లలో భారత జట్టుపై వార్న్ అంతగా ప్రభావం చూపలేదు.
1993లో జరిగిన కొన్ని టెస్టు మ్యాచ్‌లలో విఫలమైనా.. యాషెస్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. దీంతో వార్న్ మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
2007లో జరిగిన యాష్‌స్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను 708 వికెట్‌గా అవుట్ చేసిన వార్న్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వార్న్ పదిహేనేళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2003లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో క్రికెట్ నుంచి నిషేధానికి గురయ్యాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.