For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sachin Tendulkar నెలకొల్పిన ఆ అరుదైన రికార్డుకు 14 ఏళ్లు.. నేటికీ చెక్కుచెదరలేదు!!

On this day 14 years ago Sachin Tendulkar became 1st Batsman to Cross 15000 ODI Runs

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఎవరూ ఉండరు. 16 ఏళ్ల ప్రాయంలో క్రికెట్ ఆటలోకి అడుగుపెట్టిన లిటిల్ మాస్టర్​.. ప్రపంచ క్రికెట్​పై తనదైన ముద్ర వేశారు. టెస్ట్, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డులు మాస్టర్​ బ్లాస్టర్​ పేరుపైనే ఉన్నాయి. వన్డేల్లో తొలి డబుల్, క్రికెట్​లో 100 సెంచరీలు ఇలా ఎన్నో రికార్డులను తన పేరుపై లిఖించుకున్నారు. క్రికెట్‌ ప్రపంచానికే సరికొత్త గణాంకాలను సచిన్ పరిచయం చేశారు. వన్డేల్లో సచిన్‌ 15వేల పరుగుల మైలురాయిని అధిగమించి నేటితో 14 ఏళ్లు అయింది. సరిగ్గా 2007లో జూన్‌ 29నే సచిన్ ఈ ఘనత సాధించారు.

2007లో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సచిన్ టెండూల్కర్.. ఈ ఫార్మాట్‌లో 15 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. ఆ మ్యాచ్‌లో 227 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. సచిన్ (106 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ అర్ధ శతకం చేయడంతో దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలోనే సచిన్‌ వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని దాటారు. నాడు నెలకొల్పిన ఆ రికార్డు నేటికీ చెక్కుచెదరలేదు. కొందరు ఆ మార్కుకు దగ్గరగా వచ్చి ఆగిపోయారు.

సచిన్‌ టెండ్యూలర్ 1989 నవంబర్‌ 15న టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశారు. అదే ఏడాది డిసెంబర్‌ 18న మొదటి వన్డే ఆడారు. దాదాపుగా 24 ఏళ్లు ఆయన క్రికెట్‌లో కొనసాగారు. 200 టెస్టుల్లో 68 అర్ధ శతకాలు, 51 శతకాల సాయంతో 15921 పరుగులు సాధించిన సచిన్‌.. 463 వన్డేల్లో 96 హాఫ్‌ సెంచరీలు, 49 సెంచరీల సాయంతో 18426 పరుగులు చేశారు. ఇక టీ20ల్లో 10 రన్స్ చేశారు. 24 ఏళ్ల పాటు క్రికెట్ ‌ఆడిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34357 పరుగులు బాదారు.

21వ శతాబ్దానికి టెస్ట్ ఫార్మాట్​లో గొప్ప బ్యాట్స్​మన్‌గా సచిన్ టెండ్యూలక్ర్ నిలిచారు. దీనిపై నిర్వహించిన ఓ సర్వేలో మాస్టర్​ బ్లాస్టర్​కే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇందులో సచిన్‌కు పోటీగా శ్రీలంక మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ కుమార సంగక్కర నిలిచారు. రసవత్తర పోటీ ఉన్నా క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన సచిన్‌.. 21వ శతాబ్దపు గొప్ప బ్యాట్స్​మన్‌గా నిలిచారు.

Story first published: Tuesday, June 29, 2021, 21:35 [IST]
Other articles published on Jun 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+