పదేళ్ల క్రితం ఇదే రోజు.. వన్డేల్లో ద్విశతకం బాదిన తొలి క్రికెటర్‌గా సచిన్!!

హైదరాబాద్: క్రికెట్ చరిత్రలో 2010 ఫిబ్రవరి 24ను ఏ క్రికెట్ అభిమాని మరిచిపోడు. ముఖ్యంగా భారత అభిమానులు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున క్రికెట్ ప్రపంచంలో ఓ సరికొత్త రికార్డును సృష్టించారు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కారు. 24 ఫిబ్రవరి 2010న దక్షిణాఫ్రికాతో గ్వాలియర్‌లో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ
డేల్ స్టెయిన్, వేన్ పార్నెల్, జాక్విస్ కలిస్ వంటి హేమాహేమీలను ఎదుర్కొని 147 బంతుల్లోనే సచిన్ డబుల్ సెంచరీ చేసారు. సచిన్ ఏకంగా 25 బౌండరీలు, మూడు సిక్సర్లు బాదడం విశేషం. ఇండియా ఇన్సింగ్ చివరి ఓవర్ మూడో బంతికి సచిన్ 200 పరుగుల మైలురాయిని అందుకున్నారు. చార్ల్ లాంగ్‌వెల్ట్ వేసిన బంతికి సచిన్ సింగిల్ తీసి వన్డే క్రికెట్‌లో తొలి ద్విశతకాన్ని నమోదు చేశారు.

ఏడుసార్లు ద్విశతకాలు
సచిన్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత వన్డేల్లో ఏడుసార్లు ద్విశతకాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ కూడా ఉన్నారు. సెహ్వాగ్ ఒక్కసారి డబుల్ బాదగా.. రోహిత్ మూడు సార్లు ఆ ఘనత సాధించారు. ఇక విండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్‌గేల్, న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్, పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్‌లు ద్విశతకాన్ని అందుకున్నారు.

అప్పట్లోనే బెలిండా క్లార్క్ డబుల్ సెంచరీ
అయితే సచిన్ కన్నా ముందు డబుల్ సెంచరీని మరొకరు చేశారు. 16 డిసెంబరు 1997లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌వుమెన్ బెలిండా క్లార్క్ డబుల్ సెంచరీ నమోదు చేసారు. డెన్మార్క్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో క్లార్క్ 229 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అప్పుడు క్లార్క్ సంచలనం కాగా.. మరోసారి సచిన్ నిలిచారు.
చరిత్ర పుస్తకాలను తిరగరాసారు
సచిన్ ప్రత్యేక ఇన్నింగ్స్‌కు గుర్తుచేస్తూ ఐసీసీ ఆనాటి ఫొటోను అభిమానులతో పంచుకుంది. 'పది సంవత్సరాల క్రితం సచిన్ టెండూల్కర్ చరిత్ర పుస్తకాలను తిరగరాసారు. పురుషుల వన్డే క్రికెట్లో మొదటి డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్ అయ్యారు. సచిన్ తర్వాత వన్డేల్లో ఏడుసార్లు ద్విశతకాలు నమోదయ్యాయి' ఐసీసీ ట్వీట్ చేసింది.

153 పరుగులతో ఘన విజయం:
ఎంఎస్ ధోనీ నాయకత్వంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 401/3 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సచిన్‌తో పాటు దినేశ్ కార్తిక్ (79; 85 బంతుల్లో, 4x4, 3x6), యూసుఫ్ పఠాన్ (36; 23 బంతుల్లో 4x4, 2x6), ధోనీ (68; 35 బంతుల్లో 7x4, 4x6) చెలరేగారు. అనంతరం లక్ష ఛేదనలో దక్షిణాఫ్రికా 248 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 153 పరుగులతో ఘన విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications