75th Independence For India: ఇండియా 11 వర్సెస్ వరల్డ్ 11 మ్యాచ్.. ఎప్పుడు? బీసీసీఐ అభిప్రాయం ఏంటీ?

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట స్పెషల్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా.. ఆగస్టు 22న ఇండియా XI వర్సెస్ వరల్డ్ XI మధ్య క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)కు ప్రతిపాదనలు చేసింది. ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రచారంలో భాగంగా టీమిండియాకు చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఆటగాళ్ల మధ్య మ్యాచ్ జరిపేలా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బీసీసీఐకి ప్రతిపాదనలు పంపింది.
అయితే ఈ ప్రతిపాదన గురించి బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు ఇది సాధ్యమయ్యే పని కాదన్నట్లు మాట్లాడాడు. ఆ టైంకి విదేశీ ప్లేయర్ల లభ్యతపై ఆందోళన వ్యక్తం చేసింది. 'ఆగస్టు 22న ఇండియా ఎలెవన్ మరియు వరల్డ్ ఎలెవన్ మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలని ప్రభుత్వం నుండి మాకు ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే. భారత్ తరఫున ప్లేయింగ్ 11ను సిద్ధం చేయడానికి మాకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ మిగిలిన ప్రపంచ జట్టు కోసం మాకు కనీసం 13-14మంది అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు కావాలి. వారు ఆ టైంకి అందుబాటులో ఉంటారో ఉండరో కూడా చూసుకోవాలి.' అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రచారంలో భాగంగా..స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశంలోని విభిన్న సంస్కృతి, చరిత్ర, ఘన విజయాలను చాటిచెప్పడానికి భారత ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు జరుపుతోంది.
ఇకపోతే ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇండియా 2-0ఆధిక్యంతో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే జులై 17న ఇంగ్లాండ్ పర్యటన ముగుస్తుంది. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత.. జూలై 22-27 మధ్య భారత్ మూడు వన్డేల కోసం వెస్టిండీస్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ తర్వాత ఆగస్టు 27నుండి శ్రీలంకలో ప్రారంభమయ్యే ఆసియా కప్‌కు బయలుదేరే ముందు ఆగస్టు 18-22 తేదీలలో మూడు వన్డే మ్యాచ్‌ల కోసం టీమింండియా జింబాబ్వేలో పర్యటించనుంది. దీంతో టీమిండియాకు కూడా తీరిక లేని షెడ్యూల్ ఉండడంతో ఇండియా 11వర్సెస్ వరల్డ్ 11 మ్యాచ్ జరగడం కాస్త అనుమానమే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications