గంభీర్ పుట్టిన రోజు: అసలేమైంది.. సెహ్వాగ్ ట్వీట్‌పై అభిమానుల ప్రశ్నలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో స్పాంటేనియస్‌గా స్పందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శనివారం నాడు చేసిన ఓ ట్వీట్ అభిమానులను అయోమయంలో పడేసింది.
గౌతమ్ గంభీర్ పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశాడు.

సెహ్వాగ్ ట్వీట్‌కు స్బందించిన గంభీర్.. శుభాకాంక్షలు చెప్పినందుకు థ్యాంక్స్, మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నా అని రీట్వీట్ చేశారు.
దీంతో సెహ్వాగ్‌తు ఏమైందంటూ అభిమానులు పెద్ద ఎత్తున రీట్వీట్లు చేశారు. ఎప్పుడూ ప్రత్యేక శైలిలో ట్వీట్లు చేస్తే అలరించే మీరు కామన్ ట్వీట్ ఎందుకు చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. మీకు, గంభీర్‌కు మధ్య ఏమైనా సమస్యనా అని అడిగారు.
అంటే సెహ్వాగ్ ట్వీట్‌లో ప్రత్యేకత లేకున్నా అభిమానులు జీర్ణించుకునేలా లేరు. సెహ్వాగ్ ట్వీట్ అంటేనే వెరైటీగా ఉండాలని కోరుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications