
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మ వివాహం జరిగిందా.. లేదా.. అన్న ప్రశ్నకు మంగళవారం అయిందంటూ తెరదించేయగా ఇప్పుడు మరో కొత్త ప్రశ్న తలెత్తింది. పెళ్లైన ఈ జంట కలిసి ఉండేదెక్కడ.. ఇద్దరు సెలబ్రిటీలు జంట అయినపుడు వారి ఇల్లు ఏ స్థాయిలో ఉంటుందనేది చర్చనీయాంశంగా తయారైంది.
కాగా, ఇప్పటికే విరాట్ కోహ్లీ కొనుగోలు చేసిన ఓ భవంతి ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోదు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో వర్లీ ఒకటి. ఈ జంట అక్కడే ఉండ బోతున్నారు. సకల సౌకర్యాలతో కూడిన ఈ భవనంలోనే వీరి కొత్త కాపురం పెట్టబోతున్నారు.
ముంబై నగరంలోని వార్లి ప్రాంతంలో ఓంకార్ 1973 ప్రాజెక్ట్స్ అనే పేరున్న నిర్మాణ సంస్థచే నిర్మించబడింది. ఈ అపార్డ్‌మెంట్‌లో విరాట్ కోహ్లీ 2014లోనే ఓ ఫ్లాట్‌ను ఇప్పటికే కొనుగోలు చేసి ఉంచాడు. ప్రస్తుతం ఇంటిరీయర్ పనులు జరుగుతున్నాయి. అరేబియా సముద్రానికి ఎదురుగా ఉన్న ఈ భవంతే ప్రేమ జంట నివాసం కానుందా.. అయితే ఆ భవంతి వివరాలేంటో చూద్దాం..
అపార్ట్‌మెంట్ పేరు: ఓంకార్ 1973
ఖరీదు: రూ.34 కోట్లు
అంతస్థులు: 70
ఓక్కో గది వైశాల్యం: 7,171 చదరపు అడుగులు
సౌకర్యాలు: ఇండోర్ టెన్నిస్ కోర్డు, ఫిట్‌నెస్ అండ్ స్పోర్ట్స్‌తో కలిగి క్రికెట్ ఆడేందుకు వీలుగా ఉంటుంది., స్విమ్మింగ్ పూల్, పెంపుడు జంతువులకు స్నానాలు చేసే గది, వాటి చికిత్స కోసం క్లినిక్, పిల్లలను చూసుకునేందుకు ఓ క్లినిక్, చిన్న పిల్లలు స్నానాలు చేసేందుకు ఒక పూల్, పిల్లలు ఆడుకునేందుకు చిన్న ఆటస్థలం
పెద్ద బ్రాండ్లు:
పెంపుడు జంతువులను చూసుకునే క్లినిక్‌ను ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన బార్క్లే అమెరికా సంస్థతో వారితో చేయించారు.
ల్యాండ్ స్కేప్: ఎల్‌డీఏ వారిచే ఆకృతి తయారీ
ఆర్కిటెక్ట్స్: ఫాస్టర్స్+పార్టనర్స్ ఆఫ్ లండన్
ఇతర సెలబ్రిటీలు: ఇదే భవంతిలో 29వ అంతస్థులో యువరాజ్ సింగ్ అతని భార్యతో కలిసి 2013 నుంచి నివాసముంటున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.