Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ ఎవరు?: ఆసిస్ లెగ్ స్పిన్నర్, షాకింగ్ సమాధానం

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ ఎవరు? అని ప్రశ్నించిన ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ అడమ్ జంపా పైన సామాజిక అనుసంధాన వేదికలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మరియా షరపోవా కూడా విరాట్ కోహ్లీ ఎవరు అని ప్రశ్నించి విమర్శల పాలయింది.

తాజాగా, అడమ్ జంపా విరాట్ కోహ్లీ ఎవరు అని అడిగాడు. విరాట్ కోహ్లీతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆటగాడు ఏబీ డివిల్లీయర్స్‌లను ఉద్దేశించి వారు ఎవరు అని అడమ్ జంపా ప్రశ్నించాడు.

రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ పైన విరాట్ కోహ్లీ - ఏబీ డివిల్లీయర్స్‌లు అద్భుతంగా ఆడారు. దీంతో ఆస్ట్రేలియా బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ ట్విట్టర్‌లో డివిల్లీయర్స్, విరాట్ కోహ్లీల ఫోటోలను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఉంచాడు.

ఆ ఫోటో చూసిన అడమ్ జంపా ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరు అని ప్రశ్నించాడు. అడమ్ జంపా ట్వీట్ పైన విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అతను తన ట్వీట్‌ను తొలగించాడు.

OMG! Who is Virat Kohli? asks Australia leg-spinner Adam Zampa, gets trolled

అదే సమయంలో రిచర్డ్ సన్ ఆసక్తికర సమాధానంతో కౌంటర్ ఇచ్చాడు. 'ఇషాంత్ శర్మను అడుగు' అని గట్టి సమాధానం ఇచ్చాడు.

బెంగళూరు - పుణే మ్యాచులో ఇషాంత్ శర్మ నాలుగు ఓవర్లు వేసి 47 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో ఇషాంత్ శర్మను అడుగు అని ఘాటైన కౌంటర్ ఇచ్చాడు. కాగా, అడమ్ జంపా పైన ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+