న్యూఢిల్లీ : ఎక్కడో చూసిన ఫేస్ లాగే ఉందే..! ఎవరై ఉంటారబ్బా..? ఇదే కదా సందేహం. ఇక మీ ఆలోచనను సాగదీయడం ఆపండి. టీవీ స్క్రీన్ మీద చాలాసార్లు చూసిన ఫేస్.. ఇంకా చెప్పాలంటే అతనో 'హెలికాప్టర్'.. అంటే హెలికాప్టర్ సిక్సర్లకు కేరాఫ్ అన్నమాట. ఇక ఇప్పుడు గుర్తుపట్టేయడం చాలా సులువు.
అవును ఫోటోలో ఉన్న వ్యక్తి టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. ఇంత గడ్డం ఎప్పుడు పెంచేశాడనుకుంటున్నారా..? అది పెంచిన గడ్డం కాదు, పెట్టుకున్న గడ్డం. పౌరాణిక సినిమాల్లో రుషులు తగిలించుకునే గడ్డం టైప్ అన్నమాట. అచ్చు అదే తరహాలో ధోనీ కూడా ఇలా పొడవాటి గడ్డాన్ని తగిలించుకుని తన ముద్దుల కూతురు జీవాతో ఫోటోకు పోజిచ్చాడు.
అనంతరం ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో.. ధోని గడ్డం ఫోటో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇదీ ధోని గడ్డం ఫోటో కథ.