క్వారంటైన్ పాస్:
క్వారంటైన్‌లో క్రికెట్ ఆడుతున్న వీడియోని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో షేర్ చేసారు. 'ఆదుకోవడానికి మంచి స్థలం దొరికింది. చక్కగా ఆట ఆడుతున్నారు. ఇక క్వారంటైన్ పాస్' అంటూ మాజీ సీఎం ఆ వీడియోకు క్యాప్షన్‌ని రాసుకొచ్చారు. బంతి, బ్యాట్ ఉన్న ఓ ఎమోజీని కూడా జత చేసారు. వీడియోలో మాస్క్ ధరించిన ఓ వ్యక్తి బ్యాటింగ్ చేస్తుండగా.. స్టంప్‌లకి బదులుగా కుర్చీని పెట్టారు. ఇక చాలా మంది బెడ్‌పై కూర్చుని మ్యాచ్‌ని చూస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఏదైనా సాధ్యమే:
ఒమర్ అబ్దుల్లా పోస్ట్ చేసిన వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరొకొందరు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఏదైనా సాధ్యమేనని కొందరు కామెంట్ చేయగా.. క్రికెట్ కిట్‌ని క్వారంటైన్ సెంటర్‌లోకి ఎలా అనుమతిస్తారు అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదే వీడియోను దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. 'భారతీయులు ఎక్కువ దేన్ని ప్రేమిస్తారో.. నేను చెప్పాల్సిన అవసరం ఉందా?' అని రాసుకొచ్చారు.

క్వారంటైన్ సెంటర్‌లో డ్యాన్స్:
బీహార్‌కు చెందిన రిత్ సింగ్ కతిహార్ జిల్లాలోని ఓ స్కూల్లో ఏర్పాటు చేసిన ఓ క్వారెంటైన్‌లో వంటలు చేస్తున్నాడు. కరోనా అనుమానితులను వంటలు చేయటమే కాదు వారు చక్కగా సంతోషంగా ఉండేలా చేస్తున్నాడు. ఎన్నిరోజులు నుంచి అక్కడ ఉన్నాడో తెలీదు కానీ కరోనా అనుమానితులను తన డ్యాన్సులతో అలరిస్తున్నాడు. 1968లో రిలీజ్ అయిన పడోసన్ సినిమాలోని 'ఏక్ చతుర్ నార్' పాటకు అద్భుతమైన డ్యాన్స్‌తో మంత్రముగ్గుల్ని చేస్తున్నాడు. పాటలోని ప్రతి పదానికి సరైన అర్థానికి తగినట్లుగా హావభావాల్ని పలికిస్తూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.


Click it and Unblock the Notifications

'ఆటను ఆస్వాదిస్తున్నా.. ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచనే లేదు'










