For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్.. మూడో రోజు ఆట ప్రత్యర్థిదే!

ఉప్పల్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు‌లో ఇంగ్లాండ్ తిరిగి పోటీలోకి వచ్చింది. మూడో రోజు ఆటలో పైచేయి సాధించి భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. శనివారం ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 316 పరుగులు సాధించింది. 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఒల్లీ పోప్ (148*; 208) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి కోరల్లో నుంచి ఇంగ్లాండ్‌ను కాపాడి భారత్ విజయానికి అడ్డంగా నిలబడ్డాడు.

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 421/7తో ఆటను ప్రారంభించిన భారత్ మరో 15 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పది బంతుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం సంపాదించిది. క్రీజులోకి వచ్చిన రవీండ్ర జడేజా (87; 180 బంతుల్లో), అక్షర్ పటేల్ (44; 100 బంతుల్లో) జాగ్రత్తగా బ్యాటింగ్ ప్రారంభించారు. మంచి బంతుల్ని గౌరవిస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు.

Ollie Pope helped England dominate Team India on the third day of First Test

అయితే జో రూట్ టీమిండియాకు షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో జడేజా, బుమ్రాను ఔట్ చేశాడు. కాగా, జడేజా ఔట్ వివాదాస్పదంగా మారింది. బంతి ఒకేసారి ప్యాడ్, బ్యాట్‌కు తగిలినట్లుగా కనిపిస్తుండటంతో థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో ఔట్‌గా ఏకీభవించాడు. ఆ తర్వాత రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ కూడా బౌల్డ్ అవ్వడంతో భారత్ ఆలౌటైంది.

టీమిండియా బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్ (80; 74 బంతుల్లో), రోహిత్ శర్మ (24; 27 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (23; 66 బంతుల్లో), కేఎల్ రాహుల్ (86), శ్రేయస్ అయ్యర్ (35; 63 బంతుల్లో), జడేజా (87), కేఎస్ భరత్ (41; 81 బంతుల్లో), అశ్విన్ (1), అక్షర్ పటేల్ (44) పరుగులు చేశాడు. బుమ్రా డకౌటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ దూకుడుగా బ్యాటింగ్ మొదలుపెట్టింది. బజ్‌బాల్ క్రికెట్‌తో వన్డే తరహాలో బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జాక్ క్రాలే (31; 33 బంతుల్లో)ను అశ్విన్ ఔట్ చేసినప్పటికీ లంచ్ విరామానికి 15 ఓవర్లలో 89/1తో మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ రెండో సెషన్‌లో భారత్ పుంజుకుంది. డకెల్ (47; 52 బంతుల్లో), జో రూట్‌ (2)ను బుమ్రా వరుస ఓవర్లలో బోల్తాకొట్టించాడు. కాపేపటికే బెయిర్ స్టో (10)ను జడేజా, బెన్ స్టోక్స్ (6) అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 163/5తో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది.

కానీ వన్‌డౌన్‌లో వచ్చిన ఒల్లీ పోప్ క్రీజులో పాతుకపోయాడు. సహచరులు వెనుదిరుగుతున్నా భారత్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించాడు. బెన్ ఫోక్స్ (34)తో కలిసి ఆరో వికెట్‌కు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో సెంచరీ సాధించాడు. అయితే ఫోక్స్‌ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేయడంతో 112 పరుగుల వారి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రెహాన్ అహ్మద్ (16*)తో కలిసి పోప్ అజేయంగా నిలిచాడు. పోప్ పోరాడినప్పటికీ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరేట్‌. రేపటి ఆటలో మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. బెన్ స్టోక్స్ (70; 88 బంతుల్లో) టాప్ స్కోరర్. డకెల్ (35; 39 బంతుల్లో), బెయిర్ స్టో (37; 58 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు, అక్షర్, బుమ్రా తలో రెండు వికెట్లు సాధించారు.

Story first published: Saturday, January 27, 2024, 17:08 [IST]
Other articles published on Jan 27, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+