నన్ను పెళ్లి చేసుకో.. స్టెఫీగ్రాఫ్ నవ్వు ఆపుకోలేకపోయింది: వీడియో వైరల్
స్టెఫీ గ్రాఫ్‌కు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. మాజీ టెన్నిస్ తార స్టెఫీ గ్రాఫ్‌ను ఓ అభిమాని పెళ్లి చేసుకుంటావా అని అడిగిన గతంలో అడిగిన విషయం తెలిసిందే. ఈ వీడియోను వింబుల్డన్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో మే 5న పోస్ట్ చేశారు.
దీనిని కొద్ది రోజుల్లోనే 20 లక్షల మంది వీక్షించారు. ఇది ట్విట్టర్, ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఇది వైరల్‌గా మారింది.

1996లో వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో స్టెఫీ గ్రాఫ్, కిమికో మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. స్టెఫీ సర్వ్ చేస్తుండగా 'స్టెఫీ.. నన్ను పెళ్లి చేసుకుంటావా' అని ఓ వీరాభిమాని అడిగాడు.
దీంతో స్టేడియంలోని ప్రేక్షకులందరూ నవ్వారు. స్టెఫీ గ్రాఫ్ కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. దీనికి స్టెఫీ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. సాధారణంగా వీరాభిమానులు వివిధ రకాల కామెంట్లు చేస్తుంటారు. ఈ అభిమాని పెళ్లి చేసుకుంటావా అని అనడం అందరికీ నవ్వు తెప్పించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications