For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్రెండ్: ‘సత్తెకాలపు సత్తయ్య’గా నెహ్రా దూకుడు!

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో అకౌంట్ లేదని, పాత నోకియా ఫోన్‌నే వాడుతున్నానని ప్రకటించిన టీమిండియా స్టార్ బౌలర్ ఆశిష్ నెహ్రాపై ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రశంసలు, విమర్శలు పెరిగాయి. ఇంకా ఇలాంటి వాళ్లు ఉన్నారా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

'సత్తెకాలపు సత్తెయ్య(నెహ్రా)' అంటూ పలువురు నెహ్రాను ఛమత్కరిస్తున్నారు. వీటిపై టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. 'సోషల్ మీడియాలో నెహ్రా ట్రెండ్ అవుతున్నాడు. కానీ, ఈ విషయం అతను చూడకపోవడమే ఆశ్చర్యం. ఎందుకంటే నెహ్రా 'సత్తెకాలపు సత్తెయ్య' కనుక' అంటూ పేర్కొన్నాడు.

కాగా, ఆశిష్ నెహ్రా ఇప్పుడు టీమిండియా బౌలింగ్ భారాన్ని మోస్తున్నాడు. సీనియర్ బౌలర్ అయిన నెహ్రా గాయాలు, ఫాం లేమితో గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ పుణ్యమాని ట్వంటీ20 భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు ఈ 36ఏళ్ల పేస్ బౌలర్.

'Old school' Ashish Nehra shows how it is done

ఊహించనిరీతిలో లేటు వయస్సులోనూ పడిలేచిన కెరటంలా టీమిండియాలోకి దూసుకొచ్చిన నెహ్రా.. ట్వంటీ20ల్లో అనూహ్యంగా రాణిస్తూ అంతర్జాతీయంగా మళ్లీ పాపులారిటీ తెచ్చుకున్నాడు.

పొదుపైన బౌలింగ్‌తో పొట్టి క్రికెట్‌లో నెహ్రా ఆకట్టుకుంటున్నాడు. ఆదిలో ఓపెనర్ల వికెట్లు తీస్తూ టీమిండియా బౌలర్లకు మార్గదర్శిగా నిలబడుతున్నాడు. భారత జట్టులో జహీర్ ఖాన్‌ వంటి సీనియర్ బౌలర్‌ లేని సమయంలో అతను కొత్త బంతితో బాగా రాణిస్తున్నాడు. సీనియర్‌ బౌలర్‌గా ఇటు బుమ్రాకు, అటు పాండ్యకు సూచనలు, సలహాలు ఇస్తూ గురువు పాత్రను పోషిస్తున్నాడు.

బంగ్లాదేశ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నెహ్రా ఈ ఇద్దరికి సూచనలు ఇస్తూ కనిపించాడు. ఇక బౌలింగ్‌లోనూ నెహ్రా బాగానే రాణిస్తున్నాడు. టీ20 వరల్‌ కప్‌లో ఇప్పటివరకు సగటున ఓవర్‌కు తక్కువ పరుగులు ఇచ్చిన పొదుపైన బౌలర్‌గా నెహ్రా ప్రథమస్థానంలో ఉన్నాడు.

ఓవర్‌కు 5.93 సగటు పరుగులతో పొదుపైన బౌలర్‌గా ద్వేన్ బ్రేవో, ముస్తాఫిజుర్ రహ్మాన్‌లను వెనక్కి నెట్టేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ ఆశలు నిలబెట్టింది నెహ్రానే. ఈ మ్యాచ్‌లో అతను పొదుపైన బౌలింగ్ చేయడమే కాదు.. ప్రమాదకరమైన ఉస్మాన్ ఖావాజాను ఔట్‌ చేశాడు.

ఈ రెండు జరిగి ఉండకపోతే భారత్ ముందు కొండంత లక్ష్యం ఉండేది. ఈ మ్యాచ్‌లో మొదటి బంతుల్లో 11 డాట్‌ బాల్స్‌ వేసిన నెహ్రా ఓవరాల్‌గా 13 డాట్‌ బాల్స్ వేశాడు. తన కోహ్లి కళాత్మక విధ్వంసంతో ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ను పూర్తిగా కోహ్లి తన ఖాతాలో వేసుకున్నా.. కెప్టెన్‌ ధోనీ మాత్రం నెహ్రా నైపుణ్యాన్ని కూడా కొనియాడాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా మంచి బౌలింగ్‌ను నెహ్రా వేశాడని మెచ్చుకోవడం గమనార్హం.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+