Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బామ్మ‌నూ కట్టిప‌డేసిన బుమ్రా!

Old Lady Emulates Jasprit Bumrah’s Bowling Action And Run-Up

చెన్నై: టీమిండియా బౌలింగ్ బ్యాక్‌బోన్ జ‌స్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ శైలి చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ల‌సిత్ మ‌లింగ‌, పాల్ ఆడ‌మ్స్‌, కేదార్ జాద‌వ్ త‌ర‌హాలో అంద‌రి కంటే కాస్త విభిన్నంగా బౌలింగ్ చేసే బౌల‌ర్ల‌లో ఒక‌డు బుమ్రా. త‌క్కువ ర‌న‌ప్‌తోనే స‌గ‌టున 130 కిలోమీట‌ర్ల వేగంతో బంతిని సంధిస్తుంటాడు. యార్క‌ర్లు వేయ‌డం అత‌ని ప్ర‌ధాన బలం.

అందుకే శ్లాగ్ ఓవ‌ర్ల స్పెష‌లిస్ట్‌గా అత‌ని పేరుంది. ఆ విభిన్న శైలి అత‌నికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించి పెట్టింది. వ‌ర్ధ‌మాన క్రికెట‌ర్లు చాలామంది బుమ్రా శైలిని అనుకరిస్తుంటారు.

తాజాగా త‌మిళ‌నాడుకు చెందిన ఓ 70 ఏళ్ల బామ్మ సైతం బుమ్రా బౌలింగ్ అంటే ఆక‌ట్టుకుంది. ఇంట్లో టీవీలో బుమ్రా బౌలింగ్‌ను చూస్తూ.. ఓ ఫుట్‌బాల్ చేత్తో ప‌ట్టుకుని బుమ్రాను అనుక‌రిస్తూ బౌలింగ్ చేస్తూ క‌నిపించారు. శాంత సక్కుబాయి అనే యువ‌తి దీనికి సంబంధించిన ఓ వీడియో త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియో బుమ్రా కంట్లో ప‌డింది. ఆ బామ్మ‌ను చూసిన బుమ్రా ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోయాడు. ఈ వీడియో త‌న‌కు చాలా ఆనందాన్ని క‌లిగించింద‌ని సింగిల్ లైన్ ట్వీట్ చేశాడు.

Story first published: Sunday, July 14, 2019, 9:24 [IST]
Other articles published on Jul 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+