న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆప్ఘన్‌లో దారుణం: మ్యాచ్ మధ్యలో బాంబు పేలుళ్లు, 8 మంది మృతి

By Nageshwara Rao
Official says several bombs at Afghan cricket match kill 8

హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. రంజాన్‌ మాసం కావడంతో నాన్‌గర్‌హార్‌ రాష్ట్ర రాజధాని‌ జలాలాబాద్‌లోని స్టేడియంలో క్రికెట్‌ టోర్నీని నిర్వహించారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి స్థానిక జట్ల మధ్య మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ వరుస బాంబు పేలుళ్లలో మొత్తం 8 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారంతా క్రికెటర్లే అని స్థానిక వార్తా ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అదే సమయంలో ఈ ప్రమాదంలో 45 మంది వరకు గాయపడ్డారని, ప్రస్తుతం వీరంతా స్థానిక ఆసుపత్రిలో చికత్సి పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బాంబు పేలుళ్లను ఆ రాష్ట్ర గవర్నర్‌ ఖండించడంతో పాటు మృతులకు సంతాపం తెలిపారు. ఈ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఏ తాలిబన్ గ్రూప్ బాధ్యత తీసుకోలేదు.

Afghan cricket match kill 8

ఈ ఘటనపై ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు ఆష్రఫ్‌ ఘని మాట్లాడుతూ 'జలాలాబాద్‌ మైదానంలో మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు బాధ్యులు ఎవరో ఇంకా తెలియరాలేదు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఇలాంటి దాడులకు పాల్పడటం దారుణం. దాడులకు పాల్పడిన వారు మానవత్వానికి శత్రువులు' అని పేర్కొన్నారు.

Story first published: Saturday, May 19, 2018, 14:23 [IST]
Other articles published on May 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X