ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. బీసీసీఐ అనుకున్న షెడ్యూల్‌నే ప్రకటించింది. అయితే కేవలం సెమీఫైనల్స్ జరిగే వేదికలు మాత్రం మారాయి. తొలుత రెండు సెమీఫైనల్స్‌ను చెపాక్, చిన్నస్వామి స్టేడియాల్లో నిర్వహించాలని బీసీసీఐ అనుకుంది. కానీ వర్షాకాలంలో చెన్నై, బెంగళూరుల్లో మ్యాచ్‌లు జరగడం కష్టం. ఈ కారణంగా సెమీస్ వేదికలను బీసీసీఐ మార్చేసింది.
ఈ రెండు మ్యాచులను కోల్‌కతా, ముంబైలకు మార్చినట్లు తెలిపింది. అంతేకాదు, చెపాక్‌లో ఆఫ్ఘన్‌తో ఆడేందుకు పాకిస్తాన్ ఒప్పుకోకపోయినా.. వేదికను మార్చడం కుదరదని ఐసీసీ తేల్చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడే ఆఫ్ఘన్‌ను పాక్ ఎదుర్కోనుంది. ఈ వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అక్టోబర్ 5న జరుగుతుంది.

ఇక భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులంతా వేచి చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతుంది. అదే రోజు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బర్త్ డే కావడం గమనార్హం. వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో జరుగుతుంది. ఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన ఈ షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
అయితే ముంబైలో తాము ఆడేందుకు పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ తమకు భద్రతా సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. కానీ బీసీసీఐ మాత్రం సెమీఫైనల్‌ను ముంబైలో నిర్వహించాలని డిసైడ్ అయింది. అంటే ఒకవేళ పాకిస్తాన్ కనుక సెమీస్ చేరితే చచ్చినట్లు ముంబైలో ఆడాల్సిందే. ఆసియా కప్ విషయంలో భారత్ చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పీసీబీ ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. అందుకే బీసీసీఐ కానీ, ఐసీసీ కానీ వీటిని సీరియస్‌గా తీసుకోలేదు.