Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023 ఇంగ్లండ్‌లో తీవ్రమైన గాయం.. వన్డే వరల్డ్ కప్‌కు ఆర్సీబీ స్టార్ దూరం!

పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ నెగ్గని భారత్‌కు దాదాపు ప్రతి టోర్నీలోనూ సమస్యగా మారిన జట్టు న్యూజిల్యాాండ్. ఈ టీంతో టీమిండియాకు ఎప్పుడూ సమస్యలే. అయితే ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా భారత్‌కు కివీస్‌తోనే పెద్ద సమస్య అని పలువురు మాజీలు కూడా హెచ్చరించారు. ఇలాంటి సమయంలో న్యూజిల్యాండ్‌కు పెద్ద షాక్ తగిలింది.

ఆ జట్టు కీలక ప్లేయర్ మైకేల్ బ్రేస్‌వెల్ గాయపడ్డాడు. ఇంగ్లిష్ టీ20 బ్లాస్ట్ ఆడుతున్న అతను.. ఈ లీగ్‌లో వార్సెస్టర్‌షైర్ తరఫున ఆడుతున్నాడు. యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అతనికి గాయమైంది. కేవలం 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా అతను పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పరీక్షల్లో అతని కుడి కాలి మడమ దగ్గర తీవ్రమైన గాయమైనట్లు తేలింది.

World Cup 2023

దీంతో ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు యూకేలోనే శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ ఆపరేషన్ తర్వాత కనీసం రెండు వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందట. అనంతరం స్వదేశం వెళ్లిపోనున్న బ్రేస్‌వెల్.. అక్కడ ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో అతను ఆడటం జరగదు.

చిరవగా కివీస్ జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు బ్రేస్‌వెల్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో కివీస్‌ను గెలిపించినంత పని చేశాడు కూడా. ఆ తర్వాత ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున కూడా మంచి ప్రదర్శనే చేశాడు. ఇప్పుడు అతనికి ఇలా గాయం అవడంతో ఫ్యాన్స్ కూడా బాధ పడుతున్నారు.

ఇది కివీస్ జట్టుకు ఈ ఏడాది తగిలిన రెండో షాక్. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సిక్సర్‌ను ఆపేందుకు ప్రయత్నించిన అతని మోకాలికి గాయమైంది. అతనికి కూడా ఆరు నెలల విశ్రాంతి అవసరమైంది. అయితే వన్డే వరల్డ్ కప్‌లో అతను ఆడతాడా? లేదా? అని ఇంకా క్లారిటీ రాలేదు. బ్రేస్‌వెల్ మాత్రం గ్యారంటీగా ఆడటం లేదని సమాచారం.

Story first published: Wednesday, June 14, 2023, 15:38 [IST]
Other articles published on Jun 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+