ODI World Cup 2025: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రపంచ కప్ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరుగుతుందియ ఈ సారి ప్రపంచ కప్‌కు భారత్, శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో టీమిండియా తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది. పాకిస్తాన్ మహిళల జట్టు ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడేందుకు భారతదేశానికి వస్తుందా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత పురుషుల జట్టు తమ మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ ఇది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్ కూడా రాబోయే ఐసీసీ ఈవెంట్‌ల కోసం హైబ్రిడ్ మోడల్ షరతు పెట్టింది. ఈ కారణంగా పాకిస్తాన్ మహిళల జట్టు కూడా వన్డే ప్రపంచ కప్‌కు భారతదేశానికి రాదు. పాకిస్తాన్ మహిళల జట్టు తమ అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోని కొలంబో నగరంలో ఆడుతుంది.

భారత్- పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ కూడా కొలంబోలోనే జరుగుతుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 5న జరుగుతుంది. దీనికి ముందు భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని సెప్టెంబర్ 30న బెంగళూరులో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది.
ప్రపంచ కప్‌లో భారత జట్టు షెడ్యూల్ ఇదే..
*సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక - బెంగళూరు - సాయంత్రం 3 గంటలకు
*అక్టోబర్ 5: భారత్ vs పాకిస్తాన్ - కొలంబో - సాయంత్రం 3 గంటలకు
*అక్టోబర్ 9: భారత్ vs దక్షిణాఫ్రికా - వైజాగ్ - సాయంత్రం 3 గంటలకు
*అక్టోబర్ 12: భారత్ vs ఆస్ట్రేలియా - వైజాగ్ - సాయంత్రం 3 గంటలకు
*అక్టోబర్ 19: భారత్ vs ఇంగ్లాండ్ - ఇండోర్ - సాయంత్రం 3 గంటలకు
*అక్టోబర్ 23: భారత్ vs న్యూజిలాండ్ - గువాహటి - సాయంత్రం 3 గంటలకు
*అక్టోబర్ 26: భారత్ vs బంగ్లాదేశ్ - బెంగళూరు - సాయంత్రం 3 గంటలకు
పాకిస్తాన్ ఫైనల్‌కు చేరితే, మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
పాకిస్తాన్ మహిళల జట్టు ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు చేరుకుంటే, అక్టోబర్ 29న జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకుంటే టైటిల్ పోరు కూడా అక్కడే జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుకోలేకపోతే, మొదటి సెమీఫైనల్ గౌహతిలో, ఫైనల్ బెంగళూరులో జరుగుతుంది.