Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సఫారీ జట్టు ఆ ఇద్దరి దగ్గర జాగ్రత్త పడాల్సిందే: డుప్లెసిస్

 ODI series: South Africa wary of these two 'very good' Indian players, says Faf du Plessis

హైదరాబాద్: భారత జట్టులోని ఆ ఇద్దరి ఆటగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సఫారీ జట్టుకు డుప్లెసిస్ సూచిస్తున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్‌ టెస్టు సిరీస్‌లో పరాజయానికి గురి కావడంతో వన్డే సిరీస్‌లో మొదటి నుంచే గెలుపు దిశగా ప్రయత్నిస్తోంది.

ఫిబ్రవరి 1 గురువారంతో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో డుప్లెసిస్ భారత బౌలర్లు యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్‌లను అభినందిస్తూనే సఫారీ జట్టును హెచ్చరిస్తున్నాడు.

టెస్ట్ మ్యాచ్‌లకు, వన్డే మ్యాచ్‌కు బౌలింగ్‌లో తేడా ఉంటుంది. దీంతో వన్డే మ్యాచ్‌లకు రెడ్ బాల్‌తో బాగా అలవాటు ఉన్న ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కోహ్లీ మొదటి వన్డేకు ఎంపిక చేశాడు. ఈ రిస్ట్ స్పిన్నర్స్ ఫింగర్ స్పిన్నర్స్ కంటే మెరుగ్గా బౌలింగ్ వేయగలరు. కాగా, ఈ బాధ్యతను చాహల్, కుల్‌దీప్‌లు తమ భుజాలపై వేసుకున్నారు.

'కుల్‌దీప్ యాదవ్, చాహల్ ఇద్దరూ మంచి స్పిన్నర్లు. నేను వాళ్లతో ఐపీఎల్, టీ 20 మ్యాచ్‌లలో ఆడాను. భారత ఆటగాళ్లలో వీరిద్దరూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నారు. స్పిన్ బౌలింగ్‌ను టెస్టు మ్యాచ్‌ల్లో డీల్ చేసినట్లు వన్డే మ్యాచ్‌లలో చేయడం కష్టం.' అని పేర్కొన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 1, 2018, 13:07 [IST]
Other articles published on Feb 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+