దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ప్రకటించిన వన్డే బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్ టాప్-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు చోటు లభించింది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ టోర్నీల్లో రాణించిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానం సంపాదించాడు.
ఇక టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 7వ ర్యాంకు దక్కించుకున్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 9వ ర్యాంకులో నిలిచాడు. టాప్-10లో స్థానం సంపాదించుకుని టీమిండియా బ్యాట్‌మెన్ సత్తా చాటగా, బౌలర్ల విభాగంలో టాప్-10లో ఒక్క బౌలర్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.

జింబాబ్వే పర్యటనలో ఐదు వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్ 12వ ర్యాంకులో నిలవగా, అక్షరపటేల్ 47వ ర్యాంకు, మోహిత్ శర్మ 51వ ర్యాంకు దక్కించుకున్నారు. కాగా, సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ 101వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.