అప్పుడు మొదలెట్టిన స్మిత్, పాల్
ఇకపోతే ఈ మ్యాచ్‌లో జమైకా తల్లావాస్ కెప్టెన్ రోవ్‌మాన్ పావెల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన గయానాకు మళ్లీ పేలవ ఆరంభమే లభించింది. షాయ్ హోప్ (60) మినహా మిగతావాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. 98పరుగులకు 7వికెట్లు కోల్పోయిన ఆ జట్టు మరో 20, 30పరుగులు చేస్తే ఎక్కువ అనిపించే తరుణంలో.. స్మిత్, పాల్ దండయాత్ర మొదలెట్టారు. తద్వారా ఈ సీజన్‌లో ఆ జట్టు అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు 178 చేయగలిగింది.
18వ ఓవర్లో బౌలర్ బలి
18వ ఓవర్ ప్రారంభానికి ముందు ఆరు బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 18వ ఓవర్లో జమైకా పేసర్ మిగ్యుల్ ప్రిటోరియస్‌ను టార్గెట్ చేశాడు. తొలి బంతిని సిక్స్ కొట్టిన స్మిత్.. తర్వాత బంతికి డాట్ వచ్చింది. ఇక ఆ తర్వాత నాలుగు బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. ఆ తర్వాత కీమో పాల్ సైతం మహ్మద్ అమీర్ బౌలింగ్లో ఎటాకింగ్ గేమ్ ఆడాడు. అతను ఆ తర్వాతి 19వ ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టడంతో గయానా ఆ ఓవర్‌లో 24పరుగులొచ్చాయి. ఇక 20ఓవర్లోనూ రెండు సిక్సులొచ్చాయి. జూనియర్ సింక్లెయిర్ (6*) చివరి బంతికి సిక్స్ కొట్టాడు.
262.50 స్ట్రైక్ రేటుతో స్మిత్ బ్యాటింగ్
ఇక తర్వాత బ్యాటింగ్ దిగిన జమైకా తల్లావాస్ గట్టిగానే పోరాడింది. ఆ జట్టు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (104పరుగులు 66బంతుల్లో 8ఫోర్లు, 7సిక్సర్లు) చిచ్చురేపాడు. అయితే చివర్లో అతను రనౌట్ కావడం, మిగతా బ్యాటర్ల తోడ్పాటు కరవవ్వడంతో జమైకా 12పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఓడియన్ స్మిత్, కీమో పాల్ 8వ వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో వెస్టిండీస్ మాజీ బౌలర్ ఇయాన్ బిషప్ ఆనందం వ్యక్తం పరిచారు. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేస్తూ.. స్మిత్, పాల్ బిగ్-హిట్టింగ్ సామర్థ్యాన్ని ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ఇదేరీతిలో ఆడాలని కోరాడు. ఇకపోతే స్మిత్ ఆరు సిక్సర్లతో 262.50 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయగా.. పాల్ 200 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఎంపిక చేసిన 1 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టులో స్మిత్ ఉన్నాడు.


Click it and Unblock the Notifications












