For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బుమ్రా లేకుంటే రెండు సిరీస్‌లు మేమే గెలిచేవాళ్లం'

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా లేకపోతే తాము 2-1తో వన్డే, టీ20 సిరిస్‌లను గెలిచేవాళ్లమని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్‌ స్టైరిస్‌ అన్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా లేకపోతే తాము 2-1తో వన్డే, టీ20 సిరిస్‌లను గెలిచేవాళ్లమని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్‌ స్టైరిస్‌ అన్నాడు. భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన ముగిసిన అనంతరం స్కాట్‌ స్టైరిస్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్‌లను కోహ్లీసేన 2-1తో గెలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీ20 సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకోవడంతో టీమిండియా అరుదైన రికార్డుని నెలకొల్పింది. ఈ సిరిస్‌కు ముందు వరకు న్యూజిలాండ్‌పై టీమిండియా ఒక్క టీ20 సిరిస్‌ను కూడా గెలవ సంగతి తెలిసిందే.

NZ would have won both the series 2-1, if Jasprit Bumrah wasn’t playing: Scott Styris

ఈ రెండు సిరిస్‌ల్లో భారత్ విజయం వెనుక డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. ఆరు మ్యాచ్‌ల్లో కలిపి బుమ్రా 9 వికెట్లు దక్కించుకున్నాడు. టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రాకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు కూడా లభించిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్ పర్యటనపై తాజాగా స్టైరిస్‌ ట్విటర్‌‌లో స్పందించాడు. 'న్యూజిలాండ్‌-భారత్ జట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు అద్భుతంగా సాగాయి. భారత జట్టులో బుమ్రా ఆడకపోతే న్యూజిలాండ్‌ 2-1తేడాతో రెండు సిరీస్‌లను గెలిచేది. ఇందులో ఎలాంటి సందేహం లేదు' అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

కివీస్‌-భారత్‌ మధ్య ఇటీవల ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లకు స్టైరిస్‌ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా కాన్పూర్‌ వేదికగా మూడో వన్డేలో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా 47 పరుగులిచ్చి మార్టిన్‌ గప్తిల్‌, రాస్‌ టేలర్‌, మిచెల్‌ శాంట్నర్‌ వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇక, మూడు టీ20ల సిరిస్‌లో చివరిదైన తిరువనంతపురం టీ20లో జస్ప్రీత్ బుమ్రా రెండు ఓవర్లలో 9 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో కూడా భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించి న్యూజిలాండ్‌పై తొలిసారి సిరీస్‌ను దక్కించుకుని అరుదైన ఘనత సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+