For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెమీస్ రేసు నుంచి లంక అవుట్!

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సూపర్-8 రౌండ్‌లో భాగంగా బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. కివీస్ బ్యాటర్లు పోరాడదగ్గ స్కోరు సాధించగా.. బౌలర్లు లంక బ్యాటింగ్ లైనప్‌ను కోలుకోలేని దెబ్బకొట్టారు.

జింబాబ్వేతో కాదు.. ఆ ఒక్క మ్యాచ్ ఫలితంపైనే టీమిండియా సెమీస్ ఆశలు!జింబాబ్వేతో కాదు.. ఆ ఒక్క మ్యాచ్ ఫలితంపైనే టీమిండియా సెమీస్ ఆశలు!

న్యూజిలాండ్ బ్యాటింగ్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లు క్రమబద్ధంగా పరుగులు సాధిస్తూ లంక బౌలర్లపై ఒత్తిడి పెంచారు. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ, కీలక సమయాల్లో కివీస్ హిట్టర్లు బౌండరీలతో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్(47), రచిన్ రవీంద్ర(32), మెకాంచీ(31) రాణించారు. లంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, దుష్మంత చమీరా తలో 3 వికెట్లు పడగొట్టగా.. యున స్పిన్నర్ వెల్లాలగే ఒక వికెట్ తీశాడు.

NZ vs SL New Zealand Thrashes Sri Lanka by 61 Runs Sri Lanka Out of Semifinal Race in T20 WC

లంకను ముంచేసిన బ్యాటింగ్ వైఫల్యం
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభం నుండే కష్టాలు మొదలయ్యాయి. కివీస్ బౌలర్ల స్వింగ్, లెంగ్త్‌ను అర్థం చేసుకోవడంలో లంక బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. వరుస వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ శ్రీలంక లక్ష్యం దిశగా పయనించలేదు. చివరకు 20 ఓవర్లు ఆడినప్పటికీ, కేవలం 107 పరుగులు మాత్రమే చేసి లంక చేతులెత్తేసింది. శ్రీలంక బ్యాటర్లలో కమిందు మెండిస్(31), వెల్లాలగే(29) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లు పడగొట్టి లంక నడ్డి విరవగా.. మ్యాట్ హెన్రీ 2 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ సాంట్నర్ ఒక వికెట్ తీశాడు.

అలా అయితే ప్రపంచ విజేత కాలేరు!: గంభీర్‌కు పాంటింగ్ వార్నింగ్అలా అయితే ప్రపంచ విజేత కాలేరు!: గంభీర్‌కు పాంటింగ్ వార్నింగ్

రచిన్ రవీంద్ర మాయాజాలం
న్యూజిలాండ్ విజయంలో స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కీలక పాత్ర పోషించాడు. బంతితో లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి కీలక వికెట్లు పడగొట్టాడు. రవీంద్రతో పాటు ఇతర కివీస్ బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో లంక జట్టు 100 పరుగుల మార్కును దాటడానికే ఇబ్బంది పడింది.

సెమీస్ రేసు నుండి శ్రీలంక నిష్క్రమణ
ఈ భారీ ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. సూపర్-8లో వరుస ఓటములతో ఆ జట్టు టోర్నీ నుండి నిష్క్రమించగా.. న్యూజిలాండ్ తన మొదటి విజయాన్ని నమోదు చేసి సెమీస్ రేసులో నిలిచింది. గ్రూప్ సమీకరణాల ప్రకారం కివీస్ జట్టు ఇప్పుడు సెమీఫైనల్ దిశగా ఒక బలమైన అడుగు వేసింది.

Story first published: Wednesday, February 25, 2026, 23:04 [IST]
Other articles published on Feb 25, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+