Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికాకు 'చోకర్స్' శాపం - మళ్లీ అదే కథ!

పాపం సఫారీలది విషాద గాథ. ఆ జట్టుకు చోకర్స్‌ అనే ముద్రను పోగొట్టుకోవడానికి ఇంకెంతకాలం పడుతుందో, ఇంకెన్ని ఐసీసీ టోర్నమెంట్ లు అవసరమో తెలియట్లేదు! బడా మ్యాచుల్లో ఒత్తిడికి గురవ్వడం, ఓటమి పాలవ్వడం ఆ జట్టుకు శాపంగా మారిపోయింది. తాజాగా కూడా సౌతాఫ్రికా సెమీఫైనల్ లో న్యూజిలాండ్ పై ఓడిపోయింది. దీంతో మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది.

11 మ్యాచుల్లో 9 సార్లు...
ఐసీసీ వన్డే టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో 11 సార్లు అడుగుపెట్టిన సౌతాఫ్రికా జట్టు ఏకంగా తొమ్మిది సార్లు ఓటమిని అందుకుంది. కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే ఖాతాలో వేసుకుంది. అది కూడా 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకపై గెలిచింది. 1999 CWC ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ టైగా నిలిచింది.

NZ Vs SA Chokers South Africa 9 losses in 11 icc odi tournament semifinals

గత పదేళ్లలో..
గత పదేళ్ల కాలంలో చూస్తే 2014 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2015 ప్రపంచ కప్ సెమీ ఫైనల్, 2023 ప్రపంచ కప్ సెమీఫైనల్, 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో ఓడింది సౌతాఫ్రికా.

ఆరు సార్లు వెళ్తే.. ఐదు సార్లు ఓటమే..
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలి ఎడిషన్ 1998లో విజేతగా నిలిచిన సఫారీలు.. ఆ తర్వాత నుంచి విఫలమవుతూనే ఉన్నారు. 2000, 2002 ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్లలో వరుసగా సెమీ ఫైనల్స్‌కు చేరుకున్న సౌతాఫ్రికా జట్టు రెండు సార్లు ఓటమిని అందుకుంది. 2006, 2013తో పాటు ఇప్పుడు 2025 సెమీఫైనల్ లోనూ ఓడిపోయింది. మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరుసార్లు సెమీఫైనల్ కు అర్హత సాధించిన సౌతాఫ్రికా ఐదు సార్లు ఓడిపోయింది.

వన్డే వరల్డ్ కప్ సెమీస్ లలో..
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లలోనూ ఇదే చెత్త ప్రదర్శన చేసింది దక్షిణాఫ్రికా. 1992లో సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్ పై, 1999లో ఆస్ట్రేలియాపై, 2007లోనూ ఆస్ట్రేలియాపై, 2015లో న్యూజిలాండ్‌పై ఓటమిని అందుకుంది. 2023లో మరోసారి ఆస్ట్రేలియాపై పరాజయాన్ని అందుకుంది.

రెండు సార్లు ఫైనల్ కు
ఐసీసీ ఈవెంట్లలో దక్షిణాఫ్రికా రెండు సార్లు మాత్రమే ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్‌కు చేరి విజయం సాధించిన సఫారీలు.. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుపై ఓడారు. అందుకే సౌతాఫ్రికాను చోకర్స్ అని ట్రోల్ చేస్తుంటారు క్రికెట్ అభిమానులు. వాస్తవానికి చోకర్స్ అంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయిన వారిని అంటారు.

Story first published: Thursday, March 6, 2025, 10:10 [IST]
Other articles published on Mar 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+